వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న గెలిపించినోళ్లే..: బాబు అభిమానించే జిల్లాలో జగన్‌కు పట్టం!

|
Google Oneindia TeluguNews

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా టిడిపికి కంచుకోట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా టిడిపి తన ఖాతాలో వేసుకుంది. ఇలాంటి జిల్లాలో జరిగిన తాజా జగన్ సభకు ప్రజలు వెల్లువెత్తారు. ఇక్కడ వైసిపికి గత ఎన్నికల్లో సింగిల్ సీటు రాలేదు.

ఇదే విషయాన్ని చంద్రబాబు పదేపదే ప్రస్తావించిన విషయం తెలిసిందే. మొత్తం సీట్లన్నీ తమకే ఇచ్చిన జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని పలుమార్లు చెప్పారు. అయితే, జిల్లాలో జగన్ చేపట్టిన తాజా పర్యటన విజయవంతమైంది.

రాజకీయ వ్యవస్థపై జగన్ ఆసక్తికర వ్యాఖ్య, బాబుపై తీవ్ర ఆగ్రహంరాజకీయ వ్యవస్థపై జగన్ ఆసక్తికర వ్యాఖ్య, బాబుపై తీవ్ర ఆగ్రహం

మంగళవారం నాడు ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరిన జగన్.. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం వచ్చారు. పట్టణంలోని సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ సభకు పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. టిడిపి కంచుకోటలో, అదీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత కూడా జగన్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించడం గమనార్హం.

YS Jagan irks CM Chandrababu with meeting in WG district

కాగా, ఇటీవల గత కొద్ది నెలలుగా వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా టిడిపిలో చేరుతున్న విషయం తెలిసింది. గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా పలువురు సైకిల్ ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లోను జగన్‌కు ప్రజల నుంచి మంచి స్బందన రావడం గమనార్హం.

ఫిరాయింపులపై విజయసాయి ప్రయివేటు పిటిషన్

పార్టీ ఫిరాయింపుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టున్నారు. ఫిరాయింపుల పైన చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని సాయి తన బిల్లులో పేర్కొంటున్నారు. ఈ నెల 18వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

English summary
YS Jagan irks CM Chandrababu with meeting in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X