ప్రధానిగా జగన్ -చంద్రబాబు కొత్త పార్టీ- డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఏపీలో జగన్ కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. మంత్రులు కూడా తమ పదవులు వదులుకునేందుకు మానసికంగా సంసిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో కొందరు మంత్రుల్లో అసహనం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల వారు సైతం ఫోన్లు చేసి మాజీలవుతున్నారటగా అంటూ ప్రశ్నిస్తుండటంతో సదరు మంత్రులకు చిర్రెత్తుకొస్తోంది. దాని ప్రభావం వారి వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కోవలో ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేస్తున్న జగన్ డిప్యూటీ సీఎం ఒకరు మరోసారి అదే స్ధాయిలో సంచలనం రేపారు.

డిప్యూటీ సీఎం అసహనం
ఏపీలో ప్రస్తుతం ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. సీఎం జగన్ త్వరలో చేపట్టే మంత్రివర్గ ప్రక్షాళనలో వీరంతా దాదాపుగా మాజీలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిలో కొందరు తమ సన్నిహితుల వద్ద ప్రక్షాళనపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. దీంతో వీరు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. వారు ఏం మాట్లాడుతున్నా వైరల్ అయ్యే పరిస్ధితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

ప్రధానిగా వైఎస్ జగన్
సీఎం జగన్ రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టేటప్పుడు ఓసారి సీఎం అయితే ప్రజలు మెచ్చేలా 30 ఏళ్లు ఆ పదవిలో ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆయిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాత్రం ఆయన్ను పొగుడుతున్నారో లేక చురకలు అంటిస్తున్నారో తెలియదు కానీ జగన్ ఏకంగా ప్రధాని అవుతారని జోస్యం చెప్పేస్తున్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి భవిష్యత్తులో జగన్ ప్రధాని అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అదెలాగో మాత్రం చెప్పలేదు.

చంద్రబాబు కొత్త పార్టీ సవాల్
చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామికి అదే జిల్లాకు చెందిన టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు అంటే అస్సలు గిట్టదు. ఆయనపై విమర్శలు చేయాల్సి వస్తే మరింత మసాలా జోడించి మరీ విమర్శలు చేస్తుంటారు కూడా. ఇదే క్రమంలో ఆయన మరోసారి చంద్రబాబుపై విమర్శలకు దిగారు. దివంగత ఎన్టీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ.. వేషాలు వేసేవారు రాజకీయాలకు పనికిరారంటూ గతంలో చంద్రబాబు చెప్పారని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ కు అసలు వారసులెవరో చెప్పాలన్నారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే కొత్త పార్టీ పెట్టి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

జగన్ చెప్పినట్లే అలా...
త్వరలో జరిగే ఏపీ కేబినెట్ ప్రక్షాళన గురించి కూడా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. మంత్రి పదవి ఇచ్చినప్పడే జగన్ రెండున్నర సంవత్సరాలు కాలపరిమితి ఉంటుందని చెప్పారని నారాయణ స్వామి గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసావహిస్తామన్నారు. అన్ని శక్తులు ఏకమైనా జగన్ ను ఏమీ చేయలేవన్నారు. సీఎంగా జగనే కొనసాగుతారని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో తనకు పదవి పోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన నారాయణ స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications