ఉమ్మడి కడప జిల్లాలో జగన్ కీలక నియామకాలు-నేతల జంపింగ్స్ వేళ..!

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అన్ని జిల్లాలతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోనూ అదే పరిస్ధితి. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తం అయ్యారు. ఇవాళ ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నేతలతో భేటీ అయిన జగన్ కీలక నియామకాలు చేపట్టారు. జిల్లా అధ్యక్షుల మార్పులు చేశారు. అలాగే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్ధినీ ప్రకటించారు.

ఉమ్మడి వైయస్సార్‌జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైసీపీ అధినేత జగన్ ఇవాళ భేటీ అయ్యారు. వైయస్సార్‌, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైయస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందులో నేతలు తమ అభిప్రాయాలను అధినేత జగన్ కు తెలిపారు.

ys jagan key appointments in united Kadapa district amid defections into tdp

దీంతో పార్టీ నేతల సూచనల మేరకు వైయస్సార్‌ జిల్లా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని జగన్ నియమించారు. అలాగే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిని నియమించారు. అటు అమర్ నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వైయస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ స్ధానానికి పార్టీ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని జగన్ ఎంపికచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+