వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీఎల్పీలో జగన్ కీలక వ్యాఖ్యలు-వారికే టికెట్లు ఇస్తా-మన యుద్ధం వారితోనే..

|
Google Oneindia TeluguNews

ఇవాళ జరిగిన వైసీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2024 ఎన్నికలకు సన్నద్ధం చేసే క్రమంలో ఎలాంటి మొహమాటాలకు తావివ్వబోనని తేల్చిచెప్పేశారు. అంతే కాదు పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామన్నారు. అలాగే మంత్రివర్గ కూర్పు విషయంలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా 2024 ఎన్నికలు గెలిచి తీరాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు.

వైసీపీ సర్కార్ ఏర్పాటై మూడేళ్లు కావస్తున్న సందర్భంగా పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని జగన్ ఎమ్మెల్యేలకు గుర్తుచేశారు. అనుభవంతో నేను చెప్తున్నాను... ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లడం కన్నా.. మరే ప్రభావవంతమైన కార్యక్రమం లేదని జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసారు. కనీసం మూడు సార్లు డోర్‌-డోర్‌టు కార్యక్రమం చేయాలన్నారు. కనీసం 2 సార్లు ప్రతి గడపకూ వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. మన ఇళ్లదగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలని జగన్ స్పష్టంచేశారు. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఉగాది రోజు వాలంటీర్లకు జరిగే సన్మానాల్లో సైతం ఎమ్మెల్యేలు చురుగ్గా హాజరుకావాలని జగన్ సూచించారు.

ys jagan key comments in yclp meet, warnings and suggestions to mlas on 2024 polls

మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలు తిరగాలని ఎమ్మెల్యేలకు జగన్ టార్గెట్ పెట్టారు. ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలన్నారు. ఆ సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటికీ తిరగాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఆ ఇంట్లో జరిగిన మేలేంటి? ప్రతి కుటుంబానికి జరిగిన మేలుపై ముఖ్యమంత్రిగారి రాసిన లేఖను అందించాలన్నారు. వారి ఆశీస్సులను పొందాలన్నారు. ఈ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలన్నారు. క్యాడర్‌తో మీరు మమేకం కావాలన్నారు. మళీ బేసిక్స్‌లోకి వెళ్లి బూత్‌ కమిటీల ఏర్పాటు కూడా జరగాలని జగన్ సూచించారు.
బూత్‌కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలని కోరారు. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగాలన్నారు.

మే లో సచివాలయాల సందర్శన ప్రారంభమయ్యే సరికి, జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు కావాలని జగన్ కోరారు. ఏప్రిల్‌ నాటికి కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలని, ఈ కమిటీల ఏర్పాటులో రీజినల్‌ కో-ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారని తెలిపారు. 3-4 జిల్లాలకు రీజినల్‌ కో-ఆర్డినేటర్లు ఉంటారని జగన్ తెలిపారు.
కొత్త జిల్లాలను పరిగణ లోకి తీసుకుని రీజినల్‌ కో-ఆర్డినేటర్లను నియమిస్తామన్నారు. జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామని కూడా జగన్ వెల్లడించారు.

రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తానని చెప్పానని జగన్ గుర్తుచేశారు.
మంత్రివర్గంలో నుంచి పక్కనపెడుతున్నట్టుకాదని ఉద్వాసనకు గురవుతున్న మంత్రులకు జగన్ చెప్పారు. వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్షపదవులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. మంత్రులుగా పనిచేసినందున వారికి ప్రతిష్ట పెరుగుతుందని, పార్టీని నడిపించే శక్తి ఉంటుందన్నారు. మీరు గెలవండి, పార్టీని గెలిపించుకుని రండి.. మళ్లీ మీకు అవకాశాలు వస్తాయని జగన్ వారికి సూచించారు. ఇప్పుడు మంత్రులుగా వచ్చేవారు.. మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని జగన్ సూచించారు. తలా ఒక చేయి వస్తేనే మనం గెలవగలుగుతాం, అధికారంలోకి రాగలుగుతామన్నారు. ఎరినైనా మంత్రి పదవులనుంచి తప్పిస్తున్నానంటే.. వారికి మరింత బాధ్యత అప్పగిస్తున్నట్లని తెలిపారు. తప్పుదు అనుకున్న చోట, కొన్ని సామాజిక సమీకరణాల వల్ల కొన్ని కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉంటాయన్నారు.

ఎమ్మెల్యేలుగా ఉన్న వారి పనితీరును కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని జగన్ ప్రకటించారు. రాబోతున్నది పరీక్షా సమయమని, ప్రజలకు చేసిన మంచిని తీసుకుని వెళ్లలేకపోతే అది తప్పే అవుతుందన్నారు. ఈ విషయాన్ని కూడా ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదన్నారు. ఎవరు పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదన్నారు.
సర్వేల్లో పేర్లు రాకపోతే కచ్చితంగా మార్పులు వస్తాయన్నారు. అలాంటి అవకాశం ఇవ్వకూడదని కోరుతున్నానన్నారు. - ఇప్పటివరకూ ఎలా ఉన్నా? ఇకపై ముందుకు కదలాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు.
ఎమ్మెల్యేలకు ఏప్రిల్ 1 నుంచి రెండు కోట్ల ప్రత్యేక నిధులు అందుతాయన్నారు.

టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కూా ఎమ్మెల్యేలను జగన్ కోరారు. అప్పుడు వారు టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్‌ ఇస్తారన్నారు. మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతోకాదు, మనం యుద్ధంచేస్తున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లాంటి ఉన్మాదులతో యుద్దంచేస్తున్నామని జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు. ఒక అబద్ధాన్ని నిజంచేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తారని, గోబెల్స్‌ ప్రచారంతో బుల్డోజ్‌ చేస్తారని హెచ్చరించారు.దీన్ని కౌంటర్‌ చేయడానికి ఇంకా అలర్ట్‌గా ఉండాలన్నారు.
ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను యాక్టివ్‌ చేయాలన్నారు. నిజాలను, వాస్తవాలను వారికి చేరవేయాలన్నారు.
వారి చేతిలో సాక్షి దినపత్రిక ఉండాలని జగన్ తెలిపారు. తప్పుడు ప్రచారాలను కౌంటర్‌ చేసే ఆయుధాలను కార్యకర్తల చేతిలో పెట్టాలని సూచించారు.

English summary
cm ys jagan made key comments in today's yclp meeting ahead of cabinet reshuffle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X