కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమలో బాహుబలి ప్రాజెక్టు-గ్రీన్ కోకు జగన్ శంఖుస్ధాపన-20 వేల ఉద్యోగాల టార్గెట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం లేదని వస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా ప్రభుత్వం ఇవాళ రాయలసీమలో మెగా ప్రాజెక్టుకు శంఖుస్ధాపన చేసింది. 20 వేల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రపంచంలోనే తొలిసారిగా పునరుత్పాక శక్తిని నిల్వ చేసేలా రూపొందించిన గ్రీన్ కో ప్రాజెక్టుకు సీఎం జగన్ ఇవాళ శంఖుస్ధాపన చేశారు. గ్రీన్‌కో ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

గ్రీన్​కో ప్రాజెక్ట్ దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా గుమ్మితం తండాలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ (గ్రీన్‌కో) ప్రాజెక్టుకు సీఎం ఇవాళ శంకుస్థాపన చేశారు. మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో.. ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ (గ్రీన్‌కో) ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన నిర్వహించారు. ఒకే యూనిట్​లో సౌర, పవన, హైడల్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని సీఎం జగన్ వెల్లడించారు. శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని తగ్గించే ఈ ప్రాజెక్టు దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని వ్యాఖ్యానించారు. మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

ys jagan laid foundation stone for greenco renewable energy project,target 20k employment

ఈ ప్రాజెక్టు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నట్లు జగన్ తెలిపారు. ఇందులో పంప్డ్‌ స్టోరేజీ, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఒకేచోట చేయవచ్చన్నారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో కొంతమేర సౌర, పవన విద్యుత్‌ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారని, విద్యుత్‌కు డిమాండ్‌ ఉన్న సమయంలో ఆ నీటి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తారని జగన్ వివరించారు. నిరంతరం పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత అని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు అమలు చేసేందుకు ఆదర్శంగా ఉంటుందన్నారు. శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తి తగ్గి పునరుత్పాదక విద్యుత్ పెరుగుతుందన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని ముఖ్య మంత్రి వివరించారు.

English summary
ap cm ys jagan on today laid foundation stone for greenco project in kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X