జగన్ రైతు భరోసా యాత్ర: రావెల మండిపాటు
హైదరాబాద్: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 'భరోసాయాత్ర'ను నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వివరించారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హిందూపురం బహిరంగ సభకు వైఎస్ జగన్ హాజరవుతారు.

సోమవారం మరకుంటపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన శేషప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం కొత్తకోటకు చేరుకుని రైతు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తారని తలశిల రఘురాం వివరించారు.
రైతుల ఆత్మహత్యలపై జగన్ మొసలికన్నీరు కారుస్తూ చేపట్టిన భరోసా యాత్రను ప్రజలే తిప్పికొడతారని మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. బాధిత రైతుల కుటుంబాలకు ప్యాకేజీని పెంచామన్నారు. జగన్ అవినీతి సొమ్మును ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications