YS Jagan: మోడీకి జగన్ ఘాటు కౌంటర్-చంద్రబాబుపై నాడు అలా-నేడు ఇలా..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ముఖ్యంగా నిన్న ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ అనకాపల్లి సభలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబడుతూ సీఎం జగన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబును మోడీ ఏమన్నారో గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏమంటున్నారో చూడాలని గాజువాకలో ఇవాళ జరిగిన వైసీపీ ఎన్నికల సభలో ఘాటు వ్యాఖ్యలు చేసారు.
నిన్న ప్రధాని మోడీ సభలో విమర్శలు చూస్తే ఒకటే అనిపించిందని గతంలో ఆయన కామెంట్స్ ను జగన్ గుర్తుచేశారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు గురించి మోడీ ఏమన్నారో జగన్ ఓటర్లకు గుర్తుచేసారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టిన వారి చంకనెక్కడం, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే మోడీ.. ఇప్పుడు ఎన్డీయే గూటికి వచ్చాడు కాబట్టి ఇంత కంటే గొప్పవాడు లేడని చెప్తున్నారని ఆక్షేపించారు.

రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయారో దీన్ని బట్టి ఆలోచించాలని ప్రజలను జగన్ కోరారుు. వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటలు మారుస్తున్నారని రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో ఆలోచించమన్నారు. ఇంతకీ మోడీ, బాబు, దత్తపుత్రుడు ఆడుతున్న డ్రామాలో రాష్ట్ర ప్రజలకు ఈసారి ఇస్తున్న హామీ ఏంటని అడిగారు. ప్రత్యేక హోదా ఇస్తామంటే జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయనంటే జట్టు కట్టారా అని ప్రశ్నించారు.
మీ జగన్ ఆమోదం లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు. ఐదేళ్లుగా తాను ఒప్పుకోకపోవడం వల్లే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లలేకపోయిందన్నారు. ఈ ఎన్నికల్లోనూ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. గాజువాకలో టీడీపీకి ఓటు వేయడం అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఎన్డీయేకు ఆమోదం తెలిపినట్లు అవుతుందని జగన్ తెలిపారు.
గాజువాకలో పొరబాటున టీడీపీ గెలిస్తే, ఎన్డీయే గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవరూ ఆపడం సాధ్యం కాదన్నారు. దీన్నే ఎన్నికల రిఫరెండంగా తీసుకుంటారన్నారు. ఎన్డీయే అభ్యర్ధికి ప్రజల మద్దతు ఉందంటే స్టీల్ ప్లాంట్ ప్లైవేటీకరణకు మద్దతు లభించినట్లే అని చెప్పుకుంటారన్నారు. ఆ తర్వాత జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేడన్నారు. స్థానికంగా మద్దతు ఉన్నప్పుడు నీకు బాధేంటని వారు నన్ను అడుగుతారన్నారు. రైల్వే జోన్ కు రెండు బిల్డింగులు కడితే ప్రయోజం ఉండబోతన్నారు. రైల్వే జోన్ పై కేంద్రానిది దొంగప్రేమ అన్నారు.












Click it and Unblock the Notifications