అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘రైతు భరోసా యాత్ర’ ప్రారంభించిన వైయస్ జగన్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అన్నదాతల్లో భరోసా కల్పించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లాలో 'రైతు భరోసా యాత్ర'ను ఆదివారం ప్రారంభించారు. ఆయన ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

చిలమత్తూరులో వైయస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళుర్పించారు. ఆ తర్వాత లేపాక్షి మండలంలోని వమామిడిమాకులపల్లిలో వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన రైతు కురుబ సిద్ధప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు.

 YS Jagan launches 'Raitu Bharosa Yatra'

అనంతరం అక్కడినుంచి హిందూపురానికి చేరుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని చెన్నకేశవపురంలో రాత్రికి బస చేస్తారు. కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డిని చిలమత్తూరు విద్యార్థులు, గెస్ట్ టీచర్లు కలిశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు.

తమ గురుకుల పాఠశాలలను కాలేజీ స్థాయికి పెంచాలని, వేతనాలు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే, హిందూపురం చర్చి ఫాస్టర్లు కూడా జగన్‌ను కలిశారు. న్యాక్రాంతమవుతున్న తమ చర్చి ఆస్తులను కాపాడేలా ప్రభుత్వాలపై ఒత్తిడిపెంచాలన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Sunday launched 'Raitu Bharosa Yatra'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X