నాలో మార్పు తెచ్చింది చంద్రబాబే, ఇక నుంచి - జగన్ కీలక ప్రకటన..!!
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో మాజీ ఉద్యోగ సంఘాల నేతలు చేరారు. పార్టీ నేతలతో జగన్ ఇక నుంచి తనలో పూర్తి మార్పు చూస్తారని స్పష్టం చేసారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత తాను మారక తప్పని పరిస్థితి ఏర్పడిందని జగన్ వ్యాఖ్యానించారు. తన కోసం మద్దతుగా నిలిచిన వారికి వేధిస్తున్నారని..వారి కోసం తాను అండగా నిలబడతానని జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహిద్దామని జగన్ చెప్పుకొచ్చారు. పార్టీ నిర్మాణం పూర్తి చేస్తూ నే ఇక.. జనంలోనే ఉండేలా కార్యాచరణ ఖరారు చేస్తామని జగన్ వెల్లడించారు.
మన పరిస్థితే ఇలా ఉంటే
పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. తాజా రాజ కీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైయస్ జగన్ వారితో చర్చించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీ యాలు చేయలేమన్నారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా ధ్యాస పెట్టామని వివరించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయా లన్నారు. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని జగన్ సూచించారు. ప్రతి ఇంటికి పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్ధితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రజల్లో వ్యతిరేకత
కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెప్పుకొచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుభరోసా కనిపించడం లేదు. ప్రతి పథకం కనపడకుండా పోతోందని పేర్కొన్నారు. విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. రూపాయికే రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణ మైన స్థాయికి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు హయాంలో ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మనం కూడా మన ప్రయారీటీస్‌కు అనుగుణంగా కచ్చితంగా పని చేయాలన్నారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత తనలోనూ మార్పు వచ్చిందని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ 2.0 ఖచ్చితంగా వేరే విధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మాజీ సీఎం జగన్ సమక్షంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన మాజీ నేతలు వైసీపీలో చేరారు. ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి బి.ఉమామహే శ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీవోస్ సంఘం నాయకులు తోట సీతారామంజనేయులను మాజీ సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తామ ని నేతలు వెల్లడించారు. ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందని నేతలు మాజీ సీఎం జగన్ కు వివరించారు.












Click it and Unblock the Notifications