వైసీపీలో ముఖ్య నేతల బాధ్యతల్లో జగన్ మార్పులు - కీలక నియామకాలు..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల పైన జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. కూటమి ప్రభుత్వం పైన కీలక అంశాల పైన పోరుబాట తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీలోనూ కీలక మార్పులకు జగన్ సిద్దం అయ్యారు. ఇప్పటికే ఉన్న ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులు చేసిన జగన్.. జిల్లాల వారీగా స్థానిక ఎన్నికలక కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే పార్టీలోనూ కొత్త మార్పులు ప్రారంభించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పుల తో పాటుగా కీలక నియామకాలు మొదలు పెట్టారు. స్థానిక ఎన్నికల కోసం జగన్ జిల్లాల వారీగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఒన్ టు ఒన్ సమావేశాల ద్వారా వారి నుంచి స్థానిక పరిస్థితుల పై చర్చిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక.. ఎన్నికల వ్యూహాల పైన దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగానూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పార్టీలో కొత్త నియామకాలు చేపట్టారు. పార్టీ ముఖ్య నేత భూమన కరుణాకర రెడ్డికి ప్రాంతీయ సమన్వయ కర్తగా బాధ్యతలు అప్పగించారు. పార్టీకి కీలకమైన నంద్యాల, కర్నూలు జిల్లాల సమన్వయం బాధ్యతలను కేటాయించారు. స్థానిక ఎన్నికల వేళ ఈ రెండు జిల్లాల బాధ్యత లను భూమనకు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

జగన్ వరుస నిర్ణయాలతో
అదే విధంగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ కు చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. ఇక.. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయ్ కు కీలక బాధ్యతలను జగన్ అప్పగించారు. స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ లకు జగన్ స్పష్టత ఇచ్చారు. కూటమి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మొత్తం ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు చేసి... రిజర్వేషన్లు ఖరారైన వెంటనే అభ్యర్ధులను ప్రకటించేలా వర్గాల వారీగా జాబితాలు సిద్దం చేసారు. నెల్లూరు మేయర్ అభ్యర్ధి పైనా స్పష్టత ఇచ్చారు. అదే విధంగా ప్రాంతీయ సమన్వయకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. అదే విధంగా గోదావరి జిల్లాల్లోనూ కీలక మార్పులకు జగన్ కసరత్తు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి జగన్ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
