చనిపోయిన భర్త పేరిట భార్య ఓటు రద్దు చేయాలని దరఖాస్తు!

హైదరాబాద్‌ మహానగరంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో మరో షాకింగ్ దరఖాస్తు వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని భోలక్‌పూర్‌ డివిజన్‌లో ఐదేళ్ల క్రితమే చనిపోయిన వ్యక్తి పేరిట తన భార్య ఓటును రద్దు చేయాలని ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసినట్లు తెలిసింది.

భోలక్‌పూర్‌కు చెందిన రఫీకుద్దీన్‌ ఐదేళ్ల క్రితం మరణించారు. అయినప్పటికీ ఆయన పేరుతో ఆన్‌లైన్‌లో ఫారం-7 సమర్పించి, భార్య సుల్తానా మరణించినట్లు పేర్కొంటూ ఆమె ఓటును జాబితా నుంచి తొలగించాలని కోరారు. విచారణలో సుల్తానా ఇంకా బతికే ఉన్నట్లు తేలడంతో ఈ దరఖాస్తు నకిలీదని స్పష్టమైంది.

Fake Form-7 in Musheerabad Deceased Man s Name Used to Delete Living Wife s Vote in sir process

ఎవరు ఈ బోగస్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై పోలీసు కేసు నమోదు చేయాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.ఈ మేరకు ఆయన తాజాగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించిన కాంగ్రెస్‌ నేతలు, ఇలాంటి నకిలీ దరఖాస్తులు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సమావేశంలో భోలక్‌పూర్‌ కాంగ్రెస్‌ నాయకులు రహీముద్దీన్, వాహీద్‌ హుస్సేన్, కాంగ్రెస్‌ బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ మహ్మద్‌ చాన్‌కాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గంలోని రాంనగర్‌ డివిజన్‌ పోలింగ్‌ కేంద్రం-210లో ఇటీవల 31 మంది ఓట్లను రద్దు చేయాలని బీజేపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ దాఖలు చేసిన దరఖాస్తులు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆ సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో మరో నకిలీ ఫారం-7 బయటపడటంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అనుమానాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో ఫారం-6 కొత్త ఓటర్ల నమోదు, ఫారం-7 ఓటు రద్దు, ఫారం-8 సవరణలు వంటి అప్లికేషన్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. కొన్ని చోట్ల నకిలీ, బోగస్‌ దరఖాస్తులు కూడా వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

బతుకమ్మ కానుకగా మహిళలకు రూ.2500, కళ్యాణలక్ష్మి క్రింద రెండు తులాల బంగారం.. మ్యాటర్ ఇదే!
బతుకమ్మ కానుకగా మహిళలకు రూ.2500, కళ్యాణలక్ష్మి క్రింద రెండు తులాల బంగారం.. మ్యాటర్ ఇదే!

ఎన్నికల అధికారులు అటువంటి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతే ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేపట్టాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+