దసరా సెలవుల వేళ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్..!!
దసరా సండది మొదలవుతోంది. వరుస సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సొంత ఊళ్లకు ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా ఉంటారు. ప్రత్యేక రైళ్లు.. బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో రైళ్లు ఫుల్ అయ్యాయి. రైల్వే అధికారులు ఖాళీలు చూపిస్తున్నా... కొద్ది సేపటికే ఫుల్ అవ్వటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. ఆర్టీసీ పలు ప్రాంతాలకు దాదాపు ఏడు వేల ప్రత్యేక బస్సులను ప్రకటించింది.
దసరా సెలవుల్లో ప్రతీ ఏటా రైళ్లు.. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో రాకపోకలు జరుగుతాయి. రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నవారికి ఇబ్బంది కనిపించటం లేదు. అనేక రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. బుధవారం నాటి పరిస్థితి చూస్తే టికెట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ప్రధాన స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లిను వెళ్లే చాలా రైళ్లలో భారీగా టికెట్లు బుక్ అయ్యాయి. అయితే గత కొన్నిరోజులుగా బుకింగ్ చేసుకుంటున్న వారికి మాత్రం వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. రైల్వే అధికారు లు పలు రైళ్లల్లో ఖాళీలు ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే, రిజర్వేషన్ కోసం ప్రయత్నం సమయంలో వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దీంతో.. ప్రయాణీకుల్లో ఆందోళన కనిపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ తగ్గి టికెట్ దొరుకుతుందని చాలా మంది నిరీక్షిస్తున్నారు.

సెలవుల్లో పెరుగనున్న రద్దీ
కాగా, దసరా రద్దీ వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రకటించింది. దాదాపు ఏడు వేల స్పెషల్ సర్వీసుల ను నడపాలని నిర్ణయించింది. రీజియన్ల వారిగా అన్నీ జిల్లాలకు బస్సులను ఏర్పాటు చేశారు. అధికంగా కరీంనగర్ జోన్ నుంచి మొత్తం 3533 బస్సులు నడపనుంది. కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే హైదరాబాద్ నగర పరిధిలో వారి వద్దకే బస్సు వచ్చేలా ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. అయితే, ఎక్కువ శాతం ప్రయాణీకులు రైళ్లల్లో గమ్య స్థానాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. కాగా.. రైళ్లల్లో మాత్రం వెయిటింగ్ లిస్టు పెరిగి పోతోంది. దీంతో.. మరిన్ని అదనపు రైళ్ల కోసం వేచి చూస్తున్నారు.













Click it and Unblock the Notifications
