ఆయనకు జగన్ ఫోన్ కాల్- ఆపత్కాలంలో
YS Jagan: అక్రమ కేసులో అరెస్టయిన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఆయనకు ధైర్యం చెప్పారు. భరోసా ఇచ్చారు. ధైర్యం చెప్పారు. బెయిల్ గురించి ఆరా తీశారు.
పార్టీకి చెందిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి లోక్ సభ సభ్యుడు డాక్టర్ ఎం గురుమూర్తితో వైఎస్ జగన్ మాట్లాడారు. వెంకటగిరి కోర్టు వద్ద ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా కాకాణితో మాట్లాడారు జగన్.

తాను అండగా ఉన్నానని, అధైర్య పడొద్దని జగన్ చెప్పారు. న్యాయం గెలిచి తీరుతుందని పేర్కొన్నారు. ఎలాంటి మచ్చ లేకుండా బయటికి వస్తావని జగన్ భరోసా ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలో కాకాణి గోవర్ధన్ రెడ్డితో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు జగన్. కాకాణి కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ద్వారా పరామర్శించారు.
కాకాణికి వెంకటగిరి ఫస్ట్ క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఉన్న రుస్తుం మైన్స్‌లో ఆయన అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని కేసు నమోదైంది. ఆదివారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. రుస్తుం మైన్స్‌లో అక్రమ తవ్వకాలు జరిగాయంటూ పోలీసులు నమోదు చేసిన కేసు అక్రమం అని కాకాణి తరఫు న్యాయవాదులు రోజా రెడ్డి, ఉమా మహేశ్వరరావు వాదించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని, అరెస్ట్ సమయంలో కాకాణి కుటుంబసభ్యులకు తెలియజేయలేదనీ కోర్టు దృష్టికీ తీసుకొచ్చారు.
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి.. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు వెంకటాచలం సెంట్రల్ జైలుకు తరలించారు. అనారోగ్య సమస్యల కారణంగా కాకాణికి స్పెషల్ కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని న్యాయవాదులు కోరారు.
మానవతా దృకృథంతో న్యాయమూర్తి దీనికి అంగీకరించారు. కాకాణి కోరిన విధంగా ఆయా సౌకర్యాలు కల్పించాలని రిమాండ్ ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే- అడ్వొకేట్లు రోజా రెడ్డి, ఉమా మహేశ్వరరావు.. వారంలో రెండు సార్లు జైలులో ఆయనను కలవడానికి అవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications