కేబినెట్లో 4గురు: ఢిల్లీలో చంద్రబాబుపై దెబ్బకు జగన్ ప్లాన్, మూడ్రోజులు మకాం
అమరావతి: తమ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరి, ఇప్పుడు మంత్రి పదవులు పొందిన అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావుల అంశాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకు వెళ్లాలని వైసిపి అధినేత వైయస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు.
జగన్‌తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నేతలు రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్తారు. మూడు రోజుల పాటు అక్కడ మకాం వేయనున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఈసీ, వివిధ పార్టీల ముఖ్య నేతలను కలవనున్నారు. జగన్ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఇతర జాతీయ పార్టీ నేతల అపాయింటుమెంట్ తీసుకున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 10ని సవరించాలని ఆయన కోరనున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ అధికారాల్లో మార్పులు చేయాలని, గవర్నర్‌కు కొత్త అధికారాల కల్పన వంటి అంశాలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబును దెబ్బతీయాలని జగన్ సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications