బాబుని కాపాడకపోవచ్చు, కేంద్రాన్ని అడిగా: జగన్, పుష్కరాలకు మోడీ డౌట్

హైదరాబాద్: పిరికిపంద, అవినీతిపరుడు, పాస్‌పోర్టులు అమ్ముకొని జైలుకు పోయిన కేసీఆర్, ఇప్పుడు నీతుల గురించి మాట్లాడటం విడ్డూరమని మాజీ మంత్రి, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం నిప్పులు చెరిగారు.

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. నీతిమాలిన పనులు చేసిన కేసీఆర్ నీతులు వల్లించడం దెయ్యాలువేదాలు వల్లించినట్లుందన్నారు. ప్రజాక్షేత్రంలో ఇతర పార్టీల గుర్తుల పైన పోటీ చేసి విజయం సాధించిన వారిని పదవుల ఆశ చూపి, పార్టీలో చేర్చుకున్నారన్నారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో జగన్ భేటీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారం, చంద్రబాబుకు సంబంధించిన అంశాలపై జగన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది.

అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చునని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో అవినీతికి పాల్పడిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారని మండిపడ్డారు. రేవంత్ కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చడం లేదని ప్రశ్నించారు.

ఆధారాలున్నప్పటికీ చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టలేదని కేంద్రాన్ని అడిగానని జగన్ చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హోంమంత్రికి చెప్పానని తెలిపారు.

YS Jagan meets Rajnath Singh

ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడినట్లు బయటపడిన సంభాషణల పైన సీబీఐ విచారణ జరిపించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లుగా సమాచారం. ఐదు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు.

పుష్కరాలకు మోడీ రాకపోవచ్చు!

ప్రధాని నరేంద్ర మోడీ గోదావరి పుష్కరాలకు హాజరుకాకపోవచ్చునని తెలుస్తోంది. విదేశీ పర్యటనల నేపథ్యంలో మోడీ పర్యటన రద్దయ్యే అవకాశముందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+