సుజన కోసమే బాబు మోడీకి ఫోన్: జగన్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: హుధుద్‌తో పాటు వరుస తుఫానులతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో జగన్ కలిశారు. రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాంధ్రలో ఇంకా చాలా గ్రామాలు అంధకారంలో చిక్కుకుని ఉన్నాయని, ఆ విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసి తుఫానుపై ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. సీఎం, మంత్రులంతా చిత్తశుద్ధితో పనిచేయటం లేదని, పైగా పనిచేసే వారిపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
సుజనాచౌదరికి కేంద్రమంత్రి పదవి కోసమే ప్రధానితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారని, ఆ ధ్యాస, శ్రద్ధా తుఫాను బాధితులపై పెట్టి ఉంటే రాషా్ట్రనికి మంచి జరిగేదని చెప్పారు. ఉత్తరాంధ్రకు వెళ్లి చూస్తే చంద్రబాబు సహాయక చర్యలు ఎంత బాగా చేశారో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

రాజ్‌నాథ్‌తో జగన్ భేటీ
ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతోనే చంద్రబాబు తమ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారని, అయితే తమకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధిస్తామని జగన్ చెప్పారు.

రాజ్‌నాథ్‌తో జగన్ భేటీ
జగన్‌తో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు రాజ్‌నాథ్‌ను కలిసిన బృందంలో ఉన్నారు.

రాజ్‌నాథ్‌తో జగన్ భేటీ
హుధుద్‌తో పాటు వరుస తుఫానులతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

రాజ్‌నాథ్‌తో భేటీ
హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications