చంద్రబాబు లాస్ట్ ఛాన్స్-పవన్ ఒక్క ఛాన్స్- వన్స్ మోర్ జగన్ .. జగన్ మంత్రి ట్వీట్ సెటైర్..!
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీగా సాగుతున్న రాజకీయాలు తాజాగా మరో మలుపు తిరిగాయి. దీనికి కారణం నిన్న ప్రధాన విపక్ష నేత చంద్రబాబు వేసిన ఓ డైలాగే. ఈ డైలాగ్ ఇప్పుడు ఆయన సొంత పార్టీ టీడీపీతో పాటు ఏపీలోని ఇతర రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనిపై వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు.
చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటూ చెప్పిన డైలాగ్ పై రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. ఈ డైలాగ్ ను పవన్ కళ్యాణ్ డైలాగ్ , సీఎం జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారో చెప్పే డైలాగుతో పోల్చారు. చంద్రబాబు డైలాగ్, పవన్ డైలాగ్, వైఎస్ జగన్ డైలాగ్ మూడింటినీ కలిపి ఓ ట్వీట్ చేశారు. ఇందులో వైఎస్ జగన్ 175 సీట్ల టార్గెట్ తో కలిపి ట్వీట్ చేసి విపక్ష నేతల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో దాడిశెట్టి రాజా ట్వీట్ వైరల్ అవుతోంది.

మంత్రి దాడిశెట్టి రాజా తన ట్వీట్ లో చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటున్నారని, పవన్ అయితే ఒక్క ఛాన్స్ అంటున్నారని, వైఎస్ జగన్ మాత్రం వన్స్ మోర్ అని జనం అంటున్నారని ఎద్దేవా చేశారు. అందులోనే YCP 175@2024 అంటూ మరో పాయింట్ కూడా పెట్టారు. తద్వారా చంద్రబాబు, పవన్ డైలాగులు చెప్పకుంటున్నారని, జనం మాత్రం జగన్ నే మరసారి కోరుకుంటున్నారని చెప్పేందుకు దాడిశెట్టి రాజా ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications