వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడిపి కి అనుకూలంగా మారుతున్న జ‌గ‌న్ త‌ప్పిదాలు..

|
Google Oneindia TeluguNews

వైసీపి అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనాలోచిత వ్యాఖ్య‌లు ఆ పార్టీ నేత‌ల‌ను అయోమ‌యానికి గురిచేస్తున్నాయి. మొన్న ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడిని జ‌గ‌న్ జ‌న‌సేన పార్టీనుండి ఊహించ‌ని వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొన్నారు. జ‌న‌సేన కార్య‌కర్త‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌త జీవితాన్ని బ‌జార్లోకి లాగినంత ప‌ని చేసారు. ఆ దెబ్బ నుండి తేరుకోక ముందే కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి మాట్ల‌డి కాపు సామాజిక‌వ‌ర్గ మనోభావాల‌ను గాయ‌ప‌రిచారు. దీంతో కాపు నేత‌ల‌నుండి తీవ్ర‌మైన ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొనే ప‌రిస్ధితులు త‌లెత్తాయి. జ‌గ‌న్ వాఖ్య‌లు సొంత‌పార్టీకి న‌ష్టం క‌లిగించేదిగా ఉండ‌డ‌మే కాకుండా అదికార తెలుగుదేశం పార్టీకి క‌లిసొచ్చే అంశాలుగా ప‌రిణ‌మించాయి.

Recommended Video

జగన్ పై దుమ్మెత్తి పోస్తున్న ముద్రగడ
మొన్న ప‌వ‌న్, నేడు కాపు రిజ‌ర్వేష‌న్లు.. వైసీపిని కుదిపేస్తున్న జ‌గ‌న్ వాఖ్య‌లు..

మొన్న ప‌వ‌న్, నేడు కాపు రిజ‌ర్వేష‌న్లు.. వైసీపిని కుదిపేస్తున్న జ‌గ‌న్ వాఖ్య‌లు..

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన అనుచిత వ్యాఖ్యలతో చంద్రబాబుపై పెరగాల్సిన వ్యతిరేకతను త‌గ్గిస్లూ, అదే వ్య‌తిరేక‌త‌ను తాను మూట‌క‌ట్టుకుంటున్నారు జ‌గ‌న్. ఇది వైసీపీ శ్రేణులను అయోమ‌యానికి గురిచేస్తోంది. గతంలో కాపు రిజర్వేషన్లుకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించిన జగన్, ఇఫ్పుడు మాట మార్చ‌డంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం మొదలైంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం దగ్గర నుంచి మొదలుపెట్టి డిఫెన్స్ లో ఉండాల్సిన టీడీపీ నేతలు కూడా ఎదురుదాడి చేస్తూ, జగన్ వ్యాఖ్యలను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు గ‌ట్టిగానే చేస్తున్నారు.

 జ‌గ‌న్ త‌ప్పిదాల‌తో సేఫ్ జోన్ లో టీడిపి..

జ‌గ‌న్ త‌ప్పిదాల‌తో సేఫ్ జోన్ లో టీడిపి..

కాపు రిజర్వేషన్లపై హామీని నిలబెట్టుకోవాల్సింది చంద్రబాబు అయితే, తన వ్యాఖ్యల ద్వారా జగన్ కాపుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ జగన్ అదే త‌ప్పుచేసారు. పవన్ ను విమర్శించటానికి రాజకీయ అంశాలు ఎన్నో ఉన్నప్ప‌టికి., సడన్ గా ఎవరూ ఊహించని రీతిలో వ్యక్తిగత విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశం. వరసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వైసీపీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతున్నాయి. చాలా మంది నేతలు జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కూడా పార్టీ వర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది.

 కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంలో బాబుకు ప్ల‌స్ ఐన‌ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు..

కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంలో బాబుకు ప్ల‌స్ ఐన‌ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు..

ఆంధ్రప్రదేశ్ లో రకరకాల కారణంతో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. అయితే పెరిగే ఈ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాల్సిన వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వరస పెట్టి సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటూ ఆ పార్టీ క్యాడర్లో కలకలం రేపుతున్నారు. తాజాగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుప‌రిచారు.

జ‌గ‌న్ వాఖ్యలతో గంద‌ర‌గోళంలో ప‌డ్డ పార్టీ క్యాడ‌ర్.. న‌ష్ట నివార‌ణ దిశ‌గా నేత‌ల చ‌ర్య‌లు..

జ‌గ‌న్ వాఖ్యలతో గంద‌ర‌గోళంలో ప‌డ్డ పార్టీ క్యాడ‌ర్.. న‌ష్ట నివార‌ణ దిశ‌గా నేత‌ల చ‌ర్య‌లు..

చాలా సంవత్సరాల పాటు గా మంజునాథ కమిషన్ ఈ రిజ‌ర్వేష‌న్ అంశం పై పిని చేసింది. చివర్లో కమిషన్ ఛైర్మన్ మంజునాథ లేకుండానే కేవలం కమిటీ సభ్యులతో నివేదిక రూపొందించుకుని ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో పాస్ చేయంచారు చంద్ర‌బాబు. త‌ర్వాత అదే తీర్మానాన్ని కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించారు చంద్ర‌బాబు. సహజంగా ఇఛ్చిన హామీని నిలబెట్టుకోవాలసిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంటుంది. ప్రధాని మోడీ అయితే 50 శాతం పైన రిజర్వేషన్లు ఎవరు ఇస్తామన్నా అది సాధ్యం కాదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇలాంటి ప‌రిస్తితిలో పెండింగ్ లో ఉన్న రిజ‌ర్వేష‌న్ల అంశం ప‌ట్ల జ‌గ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి కాపు వ‌ర్గాల మ‌నోభావాల‌ను నొప్పించారని. క‌నీసం చంద్ర‌బాబు బిల్లైనా పాస్ చేయించారని, ఏదీ లేకుండానే జ‌గ‌న్ చేతులెత్తేసార‌నే చ‌ర్చ ఏపిలో జోరుగా జ‌రుగుతోంది. జ‌గ‌న్ చేస్తున్న వ‌రుస పొర‌పాట్ల వ‌ల్ల వైసీపి శ్రుణుల్లో అయోమ‌యం నెల‌కొన‌డంతో పాటు టీడిపి ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌నే అభిప్రాయాన్ని వైసీపి శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి.

English summary
ysrcp chief jagan mohan reddy comments keeping his cadre in dialama. jagan faced problems with janasena chief pawan fans few days back and latest with kapu community. jagan became villain by commenting on kapu reservations. all jagan comments helping chandrababu naidu to strengthen his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X