మ్యానిఫెస్టోకే దిక్కులేదు-విజన్ 2047 అంట..! జగన్ పంచ్ లు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఇవాళ అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకున్న తాజా పరిస్ధితులతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా జగన్ వారితో చర్చించారు. అలాగే తమ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణలను గుర్తు చేసిన జగన్.. వాటితో కూటమి సర్కార్ పాలనను పోల్చారు.

అనంతపురం జిల్లా నేతలతో ఇవాళ సమావేశం అయిన వైఎస్‌ జగన్‌.. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. విజన్‌ 2047 పేరిట డ్రామా మొదలు పెట్టారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కులేదని జగన్ వ్యాఖ్యానించారు. విజన్‌ అంటే మా ప్రభుత్వంలో తెచ్చిన సంస్కరణలు అన్నారు. ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని గుర్తుచేశారు.

ys jagan mocks Chandrababu s vision 2047 says not even implemented manifesto yet

సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి దగ్గరకే సేవలందించామని, ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థ తెచ్చామని, ప్రతి ఎకరా ఈ-క్రాప్‌ చేయించామని జగన్‌ తెలిపారు. రంగు రంగుల కథలకు విజన్‌ అని పేరు పెడుతున్నారన్నారు. దాన్ని విజన్‌ అనరు..420 అంటారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్‌ చేశారని, కొత్తగా ఏ ఒక్కరికీ పెన్షన్లు ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. ప్రభుత్వంపై పోరుకు జనం సిద్ధం కావాలన్నారు. అలాగే పార్టీ శ్రేణులకూ నాయకులుగా ఎదిగేందుకు ఇదో మంచి అవకాశమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+