విజయదశమి సందర్భంగా వైఎస్ జగన్ ఆసక్తికర ఆకాంక్ష ఇదే!
దసరా పండుగ ఘనంగా జరుపుకోవటం కోసం దేశం సిద్ధమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయ దశమి పండుగను నిర్వహించుకోవటానికి తెలుగు రాష్ట్రాలు కూడా రెడీ అయిన వేళ రాజకీయ రంగ ప్రముఖులు ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు చెప్తున్నారు.
దసరా శుభాకాంక్షలు చెప్పిన మాజీ సీఎం జగన్
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు . తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన విజయ దశమి సందర్భంగా ఆసక్తికర సందేశం ఇచ్చారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిగారు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

అంతిమ విజయం మంచినే వరిస్తుంది
లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని జగన్ ఆకాంక్ష
ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలనిరాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు వైఎస్ జగన్ పేర్కొన్నారు.
దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
కాగా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజయ దశమి శుభా కాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అందరం విజయదశమి పండుగ జరుపుకుంటున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కనకదుర్గ అమ్మవారికి చీర సారె సమర్పించిన చంద్రబాబు ఫ్యామిలీ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కనకదుర్గ అమ్మవారికి చీరసారె సమర్పించిన చంద్రబాబు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీవారి తరువాత రెండో అతిపెద్ద దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ. దుర్గమ్మను తలచుకున్నా, పూజ చేసినా విజయానికి ఢోకా ఉండదనేది భక్తుల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు.
దేవాలయాల్లో పవిత్రతను కాపాడే బాధ్యత అందరిదీ
దేవాలయాల్లో పవిత్రతను, ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచే బాధ్యత అందరిపైనా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పిన ఆయనవినూత్నంగా ఈ ఏడాది సేవా కమిటీ సభ్యులను నియమించి భక్తులకు సేవలు అందించేలా చేశామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications