నేను రాలేను: కోర్టులో జగన్ పిటిషన్, కాళ్లకు బొబ్బలెక్కినా ఇలా: రోజా (వీడియో)
అమరావతి: అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటూ, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం మాత్రం కోర్టుకు హాజరు కాలేనని నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Recommended Video

తీవ్రంగా గాయపడ్డ 'జబర్దస్థ్' రోజా
జగన్ పాదయాత్రలో ఉండటం, కొంత అనారోగ్యానికి గురి కావడంతో ఆయన కోర్టుకు రాలేకపోతున్నారని జగన్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తన పాదాలకు గాయాలైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కాళ్ల బొబ్బలను లెక్క చేయని జనం కాళ్లు చితికిపోతున్నా, లెక్క చేయకుండా బాధను దిగమింగుతూ ముందడుగు వేస్తున్నారు' అని అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications