స్థానిక పోరు వేళ వ్యూహం మార్చిన జగన్, కీలక నిర్ణయం- అక్కడే గురి..!!

ఏపీలో స్థానిక ఎన్నికల రాజకీయం మొదలైంది. వచ్చే నెల మున్సిపల్.. ఆ తరువాత పంచాయితీ ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల కోసం కూటమి పార్టీలు ముందస్తుగానే చర్యలు మొదలు పెట్టాయి. ఏకపక్షంగా గెలుపొందాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. సీట్ల షేరింగ్ పైన వచ్చే వారం సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో జగన్ సైతం ఈ ఎన్నికల ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు.

స్థానిక ఎన్నికల దిశగా కూటమి పార్టీలు సిద్దం అవుతున్నాయి. సీట్ల పంకాల పైన త్వరగా ఒక అంచనాకు రావాలని.. అభ్యర్ధులను ఖరారు చేయటం ద్వారా ప్రచారానికి సమయం ఇవ్వాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 2న కేబినెట్ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ కు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో మూడు పార్టీలు ఈ ఎన్నికల్లో 2024 తరహాలో ఏకపక్షంగా విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అప్రమత్తం అయ్యారు. అధికారంలో ఉన్న కూటమికి బ్రేకులు వేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కొత్త వ్యూహాల అమలు కోసం సిద్దం అవుతున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో సమావేశం అవుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన కోరుకుంటున్న స్థానాలు, లిస్టులో...!?
స్థానిక ఎన్నికల్లో జనసేన కోరుకుంటున్న స్థానాలు, లిస్టులో...!?
ys-jagan-moving-with-new-strategies-for-upcoming-local-body-elections-key-directions-for-party-lead

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు.. రీజినల్ ఇంఛార్జ్ లను ఆహ్వానించారు. ప్రతీ వార్డులోనూ పార్టీ అభ్యర్ధి బరిలో ఉండాలని ఇప్పటికే జగన్ నిర్దేశించారు. కూటమిలో నెలకొన్ని ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా మలచుకోవాలని జగన్ ముఖ్య నేతలకు సూచిస్తున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని చెబుతున్నారు. కాగా.. ఈ ఎన్నికల లోగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్టీ సమావేశాల దిశగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా విశాఖ, గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా పార్టీ కేడర్ తో సమావేశాల నిర్వహణ పైన ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ప్రతీ జిల్లాకు ఈ ఎన్నికల కోసం సమన్వయకర్తగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. దీని ద్వారా తాము ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామో కేడర్ కు సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నారు. యుద్దానికి సిద్దం కావాలనే నినాదంతో జగన్ పార్టీని స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. దీంతో.. వైసీపీ ఎన్నికల్లో పోటీ.. తుది ఫలితం పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+