మందుబాబులకు జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్-ఇవాళ, రేపూ రాత్రి 12 గంటల వరకూ..

ఏపీలో మందుబాబులకు కొత్త ఏడాది వేళ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే మద్య నిషేధంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో మందుబాబులకు జగన్ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఇవాళ, రేపు మద్యం షాపుల్ని రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచాలని ఆదేశించారు.

న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారు మద్యం సేవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇవాళ, రేపు మందుషాపుల్ని తెరిచి ఉంచనున్నారు. అలాగే బార్లు అర్ధరాత్రి 1 గంట వరకూ తెరిచి ఉంచనున్నారు. గతేడాది మాత్రం రాత్రి 10 గంటలకే మందుషాపులు మూసేయగా.. ఈ ఏడాది మాత్రం మందుషాపుల్ని రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచాలని నిర్ణయించారు. అలాగే బార్లు కూడా ఈ ఏడాది గంట సేపు ఎక్కువగా తెరిచి ఉంచుతున్నారు. దీంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ys jagans new year gift to drunkards in ap as wine shops open till 12 AM

న్యూఇయర్ వేడుకలపై రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. రోడ్లపై జనం తిరగకుండా ఆంక్షలు పెడుతున్నారు. అయితే మందుషాపులకు మాత్రం రాత్రి 12గంటల వరకూ అనుమతి ఇచ్చారు. బార్లకు ఒంటి గంట వరకూ ఇచ్చారు. దీంతో మద్యం అమ్మకాలు ఆ మేరకు పెరగబోతున్నాయి. దాంతోపాటే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగబోతోంది. కానీ రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై మాత్రం విమర్శళు కూడా అదే రీతిలో పెరగబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+