Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సచివాలయాల ఖాళీల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్-ఉద్యోగులపై మరింత నిఘా- కీలక ఆదేశాలు..

అమరావతి: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంల జరిగిన సమీక్షలో జగన్.. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

సచివాలయాలపై జగన్ సమీక్ష

సచివాలయాలపై జగన్ సమీక్ష

ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ,వార్డు సచివాలయాల తాజా పరిస్ధితిపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై నిఘా మరింత పెంచడంతో పాటు కొత్త ఉద్యోగాల భర్తీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే సచివాలయాల సేవలు మరింత మెరుగ్గా అందేలా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ పలు సూచనలతో పాటు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎన్నికలకు ముందు సచివాలయాలపై జగన్ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సచివాలయాలపై మరింత పర్యవేక్షణ

సచివాలయాలపై మరింత పర్యవేక్షణ

పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. సిబ్బంది హాజరు దగ్గరనుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలన్నారు. ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. రిపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ పటిష్టంగా ఉండాలని జగన్ ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై చాలా స్పష్టత ఉండాలన్నారు. విధులు, బాధ్యతలపై ఎస్‌ఓపీలు ఉండాలి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమైనదైనదని జగన్ తెలిపారు. వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలన్నారు. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు, ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి ఆ అర్జీని పరిష్కరించాలన్నారు. రీ వెరిఫికేషన్‌ కోసం పై వ్యవస్థకు వెళ్లడం అన్నడం అన్నది ప్రధానమన్నారు. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.అప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయన్నారు.

అధికారులు, ఉద్యోగులపై

అధికారులు, ఉద్యోగులపై

సచివాలయాల పనితీరు విషయంలో అధికారులు ఓనర్‌షిప్‌ తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల 2 సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు. దీనివల్ల వాటి సమర్థత పెరుగుతుందన్నారు. సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవలు అందాలన్నారు. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారని,వారి సేవలు ప్రజలకు అందాలన్నారు.

అప్పుడే ప్రజలకు అన్నిరకాలుగా ఉపయోగం, అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతామన్నారు. సిబ్బందితో మంచి సమన్వయం కోసం, వారు అందుబాటులో ఉండేలా మెరుగైన విధానాలను అవలంభించాలని జగన్ సూచించారు.

టెక్నాలజీ వాడకంపై

టెక్నాలజీ వాడకంపై

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సచివాలయాల్లో వాడుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వీటన్నింటి లక్ష్యం కావాలన్నారు. అందుకనే ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ ఫేషియల్‌ రికగ్నైజేషన్‌తో కూడిన హాజరును అమలు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలు అయితే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారన్నారు. దీనివల్ల సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారంపై దృష్టిపెడతారన్నారు. లేకపోతే అంతిమంగా ఇబ్బందులు పడేది ప్రజలేనన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలమన్నారు. గ్రామస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు సుస్థిర ప్రగతి లక్ష్యాలను అందుకోగలమని జగన్ తెలిపారు.

లేకపోతే ఆ లక్ష్యాల సాధనలో పురోగతి కనిపించదన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలో ఏపీ నంబర్‌ఒన్‌గా నిలవాలని ఆదేశించారు. అలాగే సచివాలయాల్లో సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూదన్నారు. టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరికరాల పరంగా వారికి లోటు ఉండకూడదని, నిరంతరం టెక్నాలజీని అప్‌డేట్‌ చేయాలని, వారిని అప్‌డేట్‌గా ఉంచాలన్నారు.

ఖాళీల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్

ఖాళీల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్


గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చిందని, మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్రసచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు అమలు చేయాలన్నారు. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్‌ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామంలోని ఆర్బీకేలు, విలేజ్‌ సెక్రటేరియట్స్‌లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+