వైయస్ ఉంటే జోలికి వచ్చేవారా?: జగన్ (పిక్చర్స్)

చిత్తూరు: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రం జోలికి ఎవరూ రాలేదని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగాంగా శుక్రవారం చిత్తూరు జిల్లాలోని పాకాలలోని న్యూ బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకున్న ఆయన ప్రసంగించారు. వైయస్ ఉంటే రాష్ట్రం జోలికి ఎవరైనా వచ్చేవారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 70శాతం ప్రజలు ఒప్పుకోకపోయినా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందని అన్నారు.

ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి ప్రధాని పదవిని కట్టబెట్టేందుకే ఈ విభజనను చేపట్టారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. సోనియా గాంధీని ప్రశ్నించకుండా ప్యాకేజీలడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధీకి చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయారని విమర్శించారు.

అభివాదం

అభివాదం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పాకాలలోని న్యూ బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకుంది. శంఖారావానికి హాజరైన జనాలకు అభివాదం తెలుపుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పాకాలలోని న్యూ బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పాకాలలోని న్యూ బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకుంది. సమైక్య శంఖారావానికి భారీగా హాజరైన జనం.

పూల వర్షం

పూల వర్షం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పాకాలలోని న్యూ బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకుంది. పూల వర్షం కురిపిస్తున్న జగన్ అభిమానులు. అభివాదం చేస్తున్న జగన్.

జగన్ శంఖారావం

జగన్ శంఖారావం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పాకాలలోని న్యూ బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకుంది. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న జగన్మోహన్ రెడ్డి.

తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో శాసనసభలో ఉండకుండా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర నేతలతో సమైక్యమనిపిస్తూనే.. తెలంగాణ ప్రాంత నేతలతో రాష్ట్ర విభజన కోరేలా చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగాలు, నీళ్ల సమస్యలు తలెత్తుతాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోరిన తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారని తెలిపారు. అంతేగాక వారిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారని చెప్పారు. చంద్రబాబు నోట సమైక్యమనే మాటే రావడం లేదని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నడుచుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+