వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఎఫెక్ట్: ఆ నేతలకు గాలం, టిడిపి కోటలపై జగన్ ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉపఎన్నికల్లో ఫలితం వ్యతిరేకంగా రావడంతో భవిష్యత్ కార్యాచరణపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. లండన్ పర్యటన నుండి తిరిగి రాగానే పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ చీఫ్ జగన్ కార్యాచరణను మొదలుపెట్టే అవకాశం ఉంది.

నంద్యాల ఎఫెక్ట్: జగన్‌కు బుట్ష రేణుక షాక్, కోట్లకు బంపర్ ఆఫర్నంద్యాల ఎఫెక్ట్: జగన్‌కు బుట్ష రేణుక షాక్, కోట్లకు బంపర్ ఆఫర్

టిడిపి బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, కారణాలేమిటి? ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ బలమెంత? తదితర సమాచారాన్ని సేకరిస్తోంది వైసీపీ.క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా యాక్షన్‌ప్లాన్‌ను సిద్దం చేయనుంది వైసీపీ.

నంద్యాల ఎఫెక్ట్: వైసీపీ కోటపై టిడిపి గురి, జగన్ అతి విశ్వాసం కొంపముంచిందా?నంద్యాల ఎఫెక్ట్: వైసీపీ కోటపై టిడిపి గురి, జగన్ అతి విశ్వాసం కొంపముంచిందా?

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా దెబ్బతింది.ఈ ఫలితాలు వైసీపీ శ్రేణులను తీవ్ర నిరాశలో ముంచెత్తాయి. దీంతో భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో టిడిపిని ధీటుగా ఎదుర్కోవాలంటే వైసీపీని మరింత బలోపేతం చేయాలని వైసీపీ చీప్ జగన్ నిర్ణయానికి వచ్చారు.

నంద్యాల ఎఫెక్ట్: రూ.100 కోట్లు ఆ 16 మందికి ఇవ్వాలి, మంత్రి 'ఆది' ఆసక్తికరంనంద్యాల ఎఫెక్ట్: రూ.100 కోట్లు ఆ 16 మందికి ఇవ్వాలి, మంత్రి 'ఆది' ఆసక్తికరం

కూతురు విద్యాభ్యాసం కోసం జగన్ లండన్‌లో పర్యటనలో ఉన్నారు.వాస్తవానికి జగన్ ఈ నెల 19వ, తేదికే హైద్రాబాద్ తిరిగి రావాల్సి ఉంది. కానీ, కొన్ని కొరణాల వల్ల తన పర్యటనను మరో రెండు రోజుల పాటు వాయిదా వేసుకొన్నారని పార్టీ వర్గాల సమాచారం.

లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్ర నిర్వహణపై చేపట్టాల్సిన కార్యక్రమాలు,పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో వైసీపీ చీఫ్ జగన్ చర్చించే అవకాశాలున్నాయి.

కొత్త వ్యూహన్ని అమలు చేయనున్న జగన్

కొత్త వ్యూహన్ని అమలు చేయనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ చీఫ్ జగన్ కేంద్రీకరించారు. లండన్ పర్యటనకు వెళ్లే ముందే వైఎస్ జగన్ కొన్ని విషయాలపై కసరత్తు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ ఏయే ప్రాంతాల్లో బలంగా ఉంది. ఆరు కంటే ఎక్కువ సార్లు విజయాలు సాధించిన స్థానాలు ఏవి. ఇలాంటి సమాచారాన్ని నేతలంతా కలెక్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి జగన్ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు. పాదయాత్ర ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉండే విధంగా వ్యూహం రచిస్తున్నారు.

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు

వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంపై లండన్ నుండి తిరిగి రాగానే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు వైఎస్సార్ కుటుంబం ఎంతవరకు వచ్చింది.. ఎంత మందికి కొత్తగా సభ్యత్వాలిచ్చారు. తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నారు. వైసీపీ బలోపేతమే కాకుండా, ప్రజాసమస్యలపై పోరాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ఏ అంశాన్ని కూడ వదులుకోకూడదని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

 వైఎస్ఆర్‌తో సన్నిహితులకు గాలం

వైఎస్ఆర్‌తో సన్నిహితులకు గాలం

తన కుటుంబంతో పాటు వైఎస్ఆర్‌తో వైఎస్సార్‌తో సన్నిహితంగా ఉండి తర్వాత ఇతర పార్టీల్లో ఉన్నవారిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అప్పుడు తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తూ పార్టీ బలపడేందుకు సహకరించాలని కోరనున్నారు. ఇందుకోసం పాదయాత్రను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర జరిగినప్పుడు వైఎస్సార్‌ సన్నిహితులకు గాళం వేసేలా వ్యూహం రచిస్తోంది వైసీపీ. ఇందుకోసం భూమన కరుణాకర్ రెడ్డి సారధ్యంలో ఓ టీమ్ పనిచేస్తున్నట్టు సమాచారం.

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా


2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను 2019 ఎన్నికల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. గతానికి భిన్నంగా ఇక నుండి వ్యవహరించాలని ఆ పార్టీ భావిస్తోంది.

English summary
Ysrcp chief Ys Jagan will implement new strategy for strengthen party in Andhra pradesh.After Ys Jagan came back return from London he will discuss with party leaders on new strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X