మనకు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, నన్ను సీఎంగా చేస్తారు!: ప్లీనరీలో జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదిక సాక్షిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆదివారం ప్రశంసలు కురిపించారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదిక సాక్షిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆదివారం ప్రశంసలు కురిపించారు.

నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రెండో రోజు వైసిపి ప్లీనరీ కొనసాగుతోంది. షర్మిల, విజయమ్మ ఇతర నేతలు మాట్లాడిన అనంతరం జగన్.. ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేశారు.

వేదిక పైన ప్రశాంత్ కిషోర్‌కు జగన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలుపుదామన్నారు. అందుకోసం మనమంతా ఏకమవుదామని చెప్పారు.

YS Jagan praises Prashant Kishor at plenary

మనకు ప్రశాంత్ కిషోర్ తోడుగా ఉన్నారని జగన్ అన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి, ఆ తర్వాత బీహార్ పీఠంపై నితీష్ కుమార్‌ను, పంజాబ్ పీఠంపై అమరీందర్ సింగ్‌ను కూర్చోబెట్టడంలో ప్రశాంతి కిషోర్ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఇప్పుడు అలాంటి ప్రశాంతి కిషోర్ మన వెంట ఉన్నారని జగన్ చెప్పారు. వైసిపిని అధికారంలోకి తెస్తారని, తనను సీఎం చేస్తారని జగన్ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+