పులివెందులలో జగన్ మెరుపు ధర్నా- ఆర్వో ఆఫీసు బయట ఏజెంట్లతో..!

ఏపీలో 92 పట్టణ స్ధానిక సంస్ధల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఓ ఎత్తు.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో మరో ఎత్తు అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్ లలోకి అనుమతించకపోవడంతో వారితో కలిసి వైఎస్ జగన్ ఆందోళన చేపట్టారు. ఎన్నికల సందర్బంగా పోలింగ్ బూత్ ల్లోకి తమను అనుమతించడం లేదంటూ ఏజెంట్లు వైఎస్ జగన్ ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఆయన వారిని తీసుకుని పులివెందుల ఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేడే.. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేడే.. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభం

ఆర్వో కార్యాలయంలోకి స్ధానిక ఎమ్మెల్యే అయిన వైఎస్ జగన్ ను కానీ, స్ధానిక ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ అనుమతించకపోవడంతో వారు పోలింగ్ ఏజెంట్లతో కలిసి బయటే ధర్నాకు దిగారు. వీరితో పాటు 70 మంది వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పులివెందుల ఆర్వో కార్యాలయం బయట ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకపోవడంపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా తీవ్ర అభ్యంతరం తెలిపారు.

YS Jagan Protests at Pulivendula RO Office After Party Agents Barred from Polling Booths
వైఎస్ షర్మిల కు వైఎస్ భారతి లేఖ రాశారా ? వైఎస్సార్సీపీ క్లారిటీ..!
వైఎస్ షర్మిల కు వైఎస్ భారతి లేఖ రాశారా ? వైఎస్సార్సీపీ క్లారిటీ..!

పులివెందుల మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించకుండా అడ్డుకోవడంపై జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయన్ను లోపలికి అనుమతించలేదు. జగన్, అవినాష్ రెడ్డితో పాటు ఏజెంట్లను కూడా ఫిర్యాదు చేయనివ్వకుండా అడ్డుకున్న అధికారులు.. ఆ తర్వాత ఏజెంట్లను మాత్రం లోపలికి పంపినట్లు తెలుస్తోంది. దీంతో వారు పోలింగ్ బూత్ ల వద్ద పోలీసుల తీరుపై ఆర్వోకు ఫిర్యాదు చేశాారు. వారి ఫిర్యాదు ఆధారంగా ఆర్వో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే మరికొన్ని గంటల్లో పోలింగ్ సమయం ముగిసిపోనుంది. ఆలోపు తమ ఏజెంట్లను బూత్ లలోకి అనుమతించకపోతే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+