బాబును నిలదీయండి: జగన్, తలరాత మార్చుకుందాం..
ప్రకాశం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయతకు అర్థం తెలీకుండా తన పాలన సాగించారని అన్నారు. ఇప్పుడు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో ఇప్పుడిచ్చే హామీలను ఎందుకు అమలు చేయలేదని జగన్ ప్రశ్నించారు. చదువుల కోసం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చంద్రబాబు చేయలేదన్నారు.

మద్యపానాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అనంతరం ఆ విషయాన్ని పక్కకు పెట్టారని అన్నారు. చంద్రబాబు ఈ ప్రాంతానికి వస్తే అదే అంశంపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రాజకీయాల్లో ఏ వ్యక్తి విశ్వసనీయతకు అర్థం తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాజకీయాల్ని దిగజార్చరన్నారని జగన్ మండిపడ్డారు. ఓటుతో తమ తలరాతను మార్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications