సభకు ఎందుకొచ్చామంటే: జగన్, రోడ్డు పైన రోజా (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అధికార తెలుగుదేశం పార్టీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మంగళవారం వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపు పైన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వారు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు.
దీంతో సభ్యులు పోడియం వద్ద చుట్టుముట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పెంపు పైన ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన విరమించక పోవడంతో.. గందరగోళం మధ్య సభాపతి శాసన సభను వాయిదా వేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాలో ఆంక్షలు విధించడం దారుణమన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా మీడియా పైన ఆంక్షలు లేవన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రస్తుత ప్రధాన సమస్య అన్నారు. దీనిని సభ దృష్టికి తీసుకు వచ్చేందుకు సభకు వచ్చామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తాము అన్నిరకాలుగా నిరసన తెలుపుతామన్నారు. కాగా, సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు అంబేడ్కర్ విగ్రహం నుండి శాసన సభకు నిరసన ర్యాలీ చేపట్టారు.

వైయస్సార్ కాంగ్రెస్
సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంబేడ్కర్ విగ్రహం నుండి శాసన సభకు నిరసన ర్యాలీ చేపట్టారు.

వైయస్సార్ కాంగ్రెస్
సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంబేడ్కర్ విగ్రహం నుండి శాసన సభకు నిరసన ర్యాలీ చేపట్టారు.

వైయస్సార్ కాంగ్రెస్
అంబేడ్కర్ విగ్రహం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు నిరసనగా వచ్చిన వైసీపీ సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.

వైయస్సార్ కాంగ్రెస్
అంబేడ్కర్ విగ్రహం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు నిరసనగా వచ్చిన వైసీపీ సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.

జగన్
ఆంధ్రప్రదేశ్ బ్యాక్ వార్డ్ క్లాస్ సంఘమ్ సభ్యులు సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.












Click it and Unblock the Notifications