Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్సీ ఫలితాలపై జగన్ ఫస్ట్ రియాక్షన్- ఎవ్వరినీ వదులుకోను-గెలవకపోతే కోట్ల మందికి నష్టం..

తాడేపల్లి : ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో జరుగుతున్న పార్టీ సమీక్షా సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలకు గుర్తుచేస్తూనే ఎమ్మెల్సీ ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్ని కూడా ప్రస్తావించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారంటూ విపక్షాలపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేసారు. 21 స్థానాల్లో ఎన్నికలు వస్తే .. అందులో 17 స్థానాల్లో వైసీపీ గెలిచిందన్నారు. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నామని, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారని జగన్ ఆక్షేపించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి అన్నారు.

ys jagan reacted on mlc election debacle in ysrcp mlas meeting, says loss to crores if we not win

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారని, అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి మాత్రమేనని జగన్ తెలిపారు. ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయన్నారు. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారన్నారు. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో... వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువన్నారు. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో (ప్రత్యక్ష నగదు బదిలీ) ఉన్నవారని జగన్ తెలిపారు. కాబట్టి ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుందని ప్రశ్నించారు.

అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదని సీఎం జగన్ గుర్తుచేశారు.ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి ఇలా జరిగిందన్నారు. ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారని విపక్షాలపై జగన్ మండిపడ్డారు. రాజకీయాల్లో నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు అన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోనన్నారు. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోనన్నారు.

మీతో పనిచేయించి మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు. ఈ అడుగులన్నీ కూడా దానికోసమేనన్నారు. కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నారన్నారు. ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం అన్నారు. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారన్నారు.
అందుకే మన గ్రాఫ్‌ పెంచుకోవాలన్నారు. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండని కోరారు. ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్‌ పెరుగుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+