అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన జగన్-విద్యాశాఖపై రివ్యూలో కీలక ఆదేశాలు..

విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్‌ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని అధికారులు తెలిపారు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నట్లు అధికారులు సీఎం జగన్ కు వివరించారు. యూనిట్‌ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో టాప్‌ 10 ర్యాంకులను 27 మంది విద్యార్ధులు సాధించినట్టు వెల్లడించారు.

అధికారుల నుంచి వివరాలు తీసుకున్న తర్వాత సీఎం జగన్.. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఒకటి బాలికలకు, రెండోది కో-ఎడ్యుకేషన్‌ ఉండాలన్నారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. వచ్చే జూన్‌ నాటికి ఈ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. నాడు - నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలన్నారు.

 jagancalender23-24

వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో .. సీఎం ఆదేశాల మేరకు విద్యాకానుక నాణ్యత విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత పాటించేలా క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 93 శాతం విద్యాకానుక వస్తువులను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంచేశారన్నారు. సీఎం ఆదేశాలమేరకు పుస్తకాలన్నింటినీ కూడా సిద్ధంచేశామన్నారు. రెండో సెమిస్టర్‌ పుస్తకాలు అన్నీకూడా ముందుగానే ఇచ్చేందుకు సిద్ధంచేశామన్నారు.

మొదటి దశ నాడు-నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఆరోతరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష చేసారు. ప్యానెల్స్‌ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై సీఎం ఆరా తీశారు. ప్యానెల్స్‌ను ఎలా వాడాలన్న దానిపై వీడియో కంటెంట్‌ టీచర్లకు పంపించాలన్నారు. కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరిద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20వేల మంది బీటెక్‌ స్టూడెంట్స్‌ ఇంటర్న్‌షిప్‌ చేస్తారని వెల్లడించారు.

 jaganmeeting

అనంతరం ట్యాబ్‌ల వాడకంపై సీఎం జగన్ సమీక్షించారు. ట్యాబ్‌ల నిర్వహణ, వినియోగంపై సీఎం ఆదేశాలమేరకు నిరంతరం సమీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారన్నారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయంపైనా సీఎం సమీక్షించారు. సుమారు 45వేల స్కూళ్లలో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలిదశ నాడు-నేడు పూర్తి చే సుకున్న స్కూళ్లలో ఇంటర్నెట్ అందిస్తామన్నారు. సెప్టెంబరు నెలాఖరుకల్లా అన్ని స్కూళ్లకు ఇస్తామన్నారు.

అనంతరం అకడమిక్‌ క్యాలెండర్‌ 2023-24ను సీఎం జగన్ విడుదల చేశారు. జూన్‌ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ తయారుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+