ఆ మంత్రిని బర్తరఫ్ చేసిన వైఎస్ జగన్-గవర్నర్ ఆమోదం..!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో వైసీపీ టికెట్లు దొరకని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇలా రాష్ట్రంలో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో సీఎం జగన్ కేబినెట్ లోని మంత్రి ఒకరు ఇవాళ విపక్ష టీడీపీలో చేరిపోయారు. మంగళగిరిలో జరుగుతున్న జయహో బీసీ సభలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సదరు మంత్రి విషయంలో జగన్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసేసుకున్నారు.
వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి గుమ్మనూరు జయరాంకు తిరిగిటికెట్ దక్కలేదు. దీంతో ఆయన ఇవాళ వైసీపీకి, మంత్రి పదవికి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. అంతే కాదు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అనంతరం మంగళగిరిలో జరుగుతున్న జయహో బీసీ సభలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు.

వైసీపీకీ, మంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు మధ్యాహ్నం ప్రకటించిన గుమ్మనూరు జయరాం.. సాయంత్రం టీడీపీలో చేరిపోవడంతో వెంటనే ఆయనపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురైంది. దీంతో సీఎం జగన్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సమాచారం పంపించారు. దీంతో సీఎం జగన్ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో జయరాం మాజీ మంత్రి అయ్యారు.













Click it and Unblock the Notifications