నా జీవితంలో చూడలేదు: జగన్, చంద్రబాబుకు రిప్లై

హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి మిగులు జలాలపై హక్కును వదులుకుంటూ లేఖ రాయడం వల్లనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగేలా వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగేనాటికి సంక్లిష్టమైన కృష్ణా జలాల పంపకాన్ని పూర్తి చేయాలనే సోనియా గాంధీ ఎత్తుగడలో భాగంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిందని, జలాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు.

సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని, ఇంత దిగుజారుడు రాజకీయాలను తాను తన జీవిత కాలంలో చూడలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కొత్త ట్రిబ్యునల్ వచ్చే లోగా మిగులు జలాలపై ఉన్న హక్కు మేరకు ప్రాజెక్టులను అన్నింటినీ నిర్మించి, వాటికి నికర జలాలు పొందాలనే మంచి ఉద్దేశంతో వైయస్ రాజశేఖర రెడ్డి లేఖ రాశారని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాసిన లేఖ సరిగా లేదంటే ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన రోశయ్య గానీ కిరణ్ కుమార్ రెడ్డి గానీ దాన్ని కాదని కొత్తగా లేఖలు రాయవచ్చు కదా అని ఆయన అన్నారు.

YS Jagan

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు విషయంలో సోనియాను, రోశయ్యను, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టకుండా చంద్రబాబు నాలుగేళ్ల క్రితం మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. బచావచ్ ట్రిబ్యునల్ మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కులు కల్పించిందని, దీనిపై కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందని ఆయన చెప్పారు. ఈ కాలంలో దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నారని, దేవెగౌడను చంద్రబాబు ప్రధానిగా చేశారని, కేంద్రంలో చక్రం తిప్పారని, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉన్నారని, అటువంటి స్థితిలో కేంద్రం కర్ణాటకకు మద్దతు పలికిందని, దాంతో మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కు లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడానికి చంద్రబాబు ప్రభుత్వం సరైన న్యాయవాదిని పెట్టలేదా, చంద్రబాబు కుమ్మక్కయ్యారా అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. మిగులు జలాలపై మన రాష్ట్రానికి హక్కు ఉన్న కాలంలో చంద్రబాబు ప్రాజెక్టులేవీ కట్టలేదని, వైయస్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పరిస్థితి తెలిసి కొత్త ట్రిబ్యునల్ వచ్చేలోగా ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేసి నికర జలాలు పొందాలని అనుకున్నారని జగన్ చెప్పారు.

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపేయాలని కర్ణాటక ట్రిబ్యునల్‌ను కోరిందని, అయితే అవన్నీ నికర జలాలపై ఆధారపడే కడుతున్నామని వైయస్ తెలిపారని జగన్ చెప్పారు. సోనియా గాంధీ పుట్టిన రోజు 209 డిసెంబర్ 9వ తేదీన కేంద్రం రాష్ట్ర విభజనకు ప్రకటన చేసిందని, ఆ ప్రకటనకు ముందు ట్రిబ్యూనల్ తాత్కాలిక తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు డిసెంబర్‌లో రాష్ట్ర విభజన చేయాలని సోనియా గాంధీ అనుకుంటున్నారని, విభజనలో నికర జలాల అంశం సంక్లిష్టం కాకూడాదనే ఉద్దేశంతోనే ట్రిబ్యునల్ తీర్పు వెలువడిందని ఆయన అన్నారు. మీకు జలాలు లేవని ట్రిబ్యునల్ చెప్పిందని ఆయన అన్నారు. ఈ స్థితిలో చంద్రబాబు సోనియాను తప్పు పట్టకుండా వైయస్‌ను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయానికి మిగులు జలాల అంశం లేకుండా చేయాలనే కుట్ర చేశారని ఆయన అన్నారు. సోనియా చాలా తప్పిదం చేస్తున్నారని ఆయన అన్నారు.

రాయల తెలంగాణ ప్రతిపాదనను వైయస్ జగన్ వ్యతిరేకించారు. రాయలసీమను ఎందుకు విడదీస్తారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన విషయంలో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని ఆయన అన్నారు. విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతును కూడగట్టాం కాబట్టే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. విభజనను ఆపగలమనే ఆశ ఉందని, పైన దేవుడున్నాడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+