గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2024 ఎన్నికలకు జగన్ కొత్త వ్యూహం- పార్టీ నేతల భేటీలో వెల్లడి-రంగంలోకి వైసీపీ వాలంటీర్లు ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న వైసీపీ అధినేత కమ్ సీఎం వైఎస్ జగన్ తాజా వ్యూహాలకు పదునుపెడుతున్నారు.ఇదే క్రమంలో పార్టీ నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో వారికి కొత్త కొత్త వ్యూహాలను నిర్దేశిస్తున్నారు. ఇవాళ జరిగిన వైసీపీ నియోజక ఇన్ ఛార్జ్ లు, జిల్లా అధ్యక్షుల భేటీలో వైఎస్ జగన్ మరో వ్యూహాన్ని నేతలకు వెల్లడించారు.

వైసీపీ నేతలతో జగన్ కీలక భేటీ

వైసీపీ నేతలతో జగన్ కీలక భేటీ

వైసీపీకి చెందిన జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు చేశారు. అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాన్ని సైతం వారికి వెల్లడించారు. దీన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు.

ఇక వైసీపీ వాలంటీర్ల వ్యవస్ధ ?

ఇక వైసీపీ వాలంటీర్ల వ్యవస్ధ ?


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో వాలంటీర్లను నియమించారు. నెలకు ఐదువేల గౌరవ వేతనంతో దాదాపు రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లను నియమించారు. రాష్ట్రంలో ప్రతీ 50 ఇళ్లకో వాలంటీర్ల చొప్పున గ్రామాలు, వార్డుల్లో ఈ వాలంటీర్లను నియమించారు. వీరిని ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికీ తీసుకెళ్లి జనంలో వైసీపీకి ఆదరణ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు వైసీపీ తరఫున మరింత మంది వాలంటీర్లను నియమించేందుకు జగన్ సిద్ధమయ్యారు.

ప్రతీ 50 ఇళ్లకు ఇద్దరు వాలంటీర్లు ?

ప్రతీ 50 ఇళ్లకు ఇద్దరు వాలంటీర్లు ?

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం తరఫున ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్ పనిచేస్తుండగా.. అదే 50 ఇళ్లకు పార్టీ తరఫున మరో ఇద్దరు వాలంటీర్లను నియమించాలని జగన్ నిర్ణయించారు. అంటే 50 ఇళ్లకు పార్టీ, ప్రభుత్వం తరఫున ముగ్గురు వాలంటీర్లు పనిచేస్తారన్నమాట. ఇందులో ఓ మహిళా నాయకురాలిని, ఓ నాయకుడిని నియమించబోతున్నారు. త్వరలో వీరిని నియమిస్తామని ఇవాళ జరిగిన వైసీపీ నేతల భేటీలో సీఎం జగన్ ప్రకటించారు. అలాగే ప్రతీ సచివాలయానికి పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లను నియమించాలని నిర్ణయించారు. వీరు 50 ఇళ్లకు ఇద్దరి చొప్పున నియమించే వాలంటీర్లను సమన్వయం చేస్తారు. త్వరలో బూత్ కమిటీల నియామకం కూడా పూర్తి చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.

2024 ఎన్నికలకు జగన్ భారీ వ్యూహం ?

2024 ఎన్నికలకు జగన్ భారీ వ్యూహం ?

2024 ఎన్నికల్లో గెలవాలంటే ప్రస్తుతం ప్రభుత్వం తరపున పనిచేస్తున్న వాలంటీర్లు సరిపోరని వైసీపీ అధినేత భావిస్తున్నారు. దీంతో పార్టీ తరపున కూడా మరో ఇద్దరిద్దరు వాలంటీర్ల చొప్పున నియమించబోతున్నారు. వారిని సమన్వయం చేసేందుకు సచివాలయానికి ముగ్గురు కన్వీనర్ల చొప్పున నియమిస్తారు. తద్వారా వీరు పథకాలను పూర్తిస్ధాయిలో లబ్దిదారులకు అందించడంతో పాటు జనంలో అసంతృప్తి స్ధాయిల్ని తగ్గించేందుకు ఉపయోగపడతారని జగన్ భావిస్తున్నారు. వీరిపై ఉండే అబ్జర్వర్లకు.. ఎమ్మెల్యేల్ని గెలిపించే బాధ్యతను అప్పగిస్తున్నారు.

English summary
ap cm ys jagan on today given key suggestions to party leaders for 2024 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X