చంద్రబాబు హామీల ఖర్చు ఇదీ, చేసిన అప్పులు ఇవీ - వెల్లడించిన జగన్..!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. 58 నెలల్లో పథకాల్ని డోర్‌ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని వివరించారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు అయ్యే ఖర్చు వివరాలతో పాటుగా..ఏపీ అప్పుల లెక్కలను జగన్ వెల్లడించారు.

చంద్రబాబు హామీల విలువ
2019-24 వరకు అయిదేళ్ల కాలంలో ఇచ్చిన హామీల అమలులో ఏనాడు కారణాలు చెప్పలేదని జగన్ చెప్పారు. కరోనా, ఆర్దిక కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయలేదన్నారు. 2.70 లక్షల కోట్లు పథకాల కోసం ఖర్చు చేసామని వెల్లడించారు. హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేసారని జగన్ వ్యాఖ్యానించారు. 2014-19 కాలంలో 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగా..తన హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ చెప్పుకొచ్చారు.

YS Jagan Reveals Chandra Babu Assurances cost and State financial status with statistics

2014-19 వరకు అమలు చేసిన పథకాలకు అన్నింటికి కలిపి దాదాపు రూ 70 వేల కోట్లు ఖర్చు అయ్యేదని వివరించారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ 1 లక్షా 21,619లక్షల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.

చంద్రబాబు అప్పులు
ఖచ్చితంగా అమలు చేయాల్సిన వాటితో కలిపితే చంద్రబాబు పథకాల ఖర్చు కోసం 1,50,178 కోట్లు అవసరమని జగన్ విశ్లేషించారు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్‌మెంట్‌, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఎవరూ ఆపలేరన్నారు. కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు.

తాను అమలు చేస్తున్న పథకాలకు రూ 70 వేల కోట్లు వరకు సమకూర్చటమే కష్టంగా మారినా...అమలు చేస్తున్నామని చెప్పారు. దీనికి రెట్టింపు మొత్తంలో నిధులు ఎలా సమకూరుస్తారని జగన్ ప్రశ్నించారు. సంపద గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని.. చంద్రబాబు పాలనలో 14 ఏళ్ల పాటు రాష్ట్రంలో లోటు బడ్జెట్ తోనే కొనసాగిందని అంకెలతో వివరించారు. 2014-19 కాలంలో చంద్రబాబు హయాంలో అప్పులు 21.8 శాతానికి పెరిగాయని గుర్తు చేసారు.

అమలు చేసేవే చెప్పాలి
తన పాలనలో ఏపీలో అప్పుల శాతం 12.13 శాతానికి పరిమితం అయిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో 4.47 శాతం జీఎస్డీపీ ఉండగా...జగన్ హయాంలో 4.83 జీఎస్డీపి ఉందని జగన్ వివరించారు. చంద్రబాబు హయాంలో పన్నుల భారం 6.57 శాతం అయితే జగన్ హయాంలో 6.35 శాతం గా జగన్ వెల్లడించారు. 2019 లో చెప్పిన హామీల్లో 99 శాతం అమలు చేసామన్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పరిగణలోకి తీసుకొని అమలు చేయగలిగినవే చెబుతానని జగన్ స్పష్టం చేసారు.

2014 లో నాడు కూటమి నేతలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని విషయాన్ని జగన్ గుర్తు చేసారు. అమ్మఒడిని రూ 15 వేల నుంచి రూ 17 వేల వరకు పెంచుతూ హామీ ఇచ్చారు. రైతు భరోసా రూ 16 వేలకు పెంచుతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. దీంతో..జగన్ మేనిఫెస్టో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+