Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వ్యవసాయ మీటర్లు సక్సెస్-రైతుల్లో అవగాహన కల్పించమన్న జగన్-ఇంధన సమీక్షలో కీలక ఆదేశాలు

ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో సీఎం జగన్ ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్‌శాఖ అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా విద్యుత్ డిమాండ్, తాజా పరిస్ధితి, బొగ్గు నిల్వలు, గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు వంటి విషయాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. అనంతరం కీలక ఆదేశాలు జారీ చేశారు.

 డేటా అనలిటిక్స్ తో తగ్గిన ఖర్చు

డేటా అనలిటిక్స్ తో తగ్గిన ఖర్చు

విద్యుత్‌ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్‌ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ కు అధికారులు ఇవాళ సమీక్షలో తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందన్నారు. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపిపేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని ఉపయోగించుకుంటున్నామన్నారు. దీంతో గతంలో ఎంఓపీఈ 4 నుంచి 5 శాతం ఉంటే, ఇప్పుడు 2 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. అలాగే సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్‌ఫార్మన్‌ పాడైన 24 గంటల్లోపే ట్రాన్స్‌ఫార్మర్‌ పెడుతున్నామన్నారు. దీనివల్ల రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. గత 90 రోజుల్లో 99.5శాతం ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లోపే రీప్లేస్‌ చేశామన్నారు.

 జగన్ కీలక ఆదేశాలు

జగన్ కీలక ఆదేశాలు

ఈ సందర్భంగా రాష్ట్రంలో బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలన్నారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. సులియారీ, మహానది కోల్‌బాక్స్‌ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ప్రయత్నించాలన్నారు. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌ అందుబాటులోకి వచ్చిందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇదే నెలలో సీఎం జగన్ తో ప్రారంభించే కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ థర్మల్‌ పవర్‌ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామన్నారు. జగనన్న కాలనీల్లో విద్యుత్‌ సదుపాయం కల్పనపై వివరాలు కూడా సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని జగన్ ఆదేశించారు.

 వ్యవసాయ మీటర్లపై సానుకూలత

వ్యవసాయ మీటర్లపై సానుకూలత

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 16,63,705 మంది రైతుల అంగీకరించారని సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్నారు.
రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు కూడా అందించాలన్నారు. రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్‌ వాడుతున్న ఘటనలు కూడా దాదాపుగా అడ్డుకోగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

 వ్యవసాయ మీటర్ల వల్ల ప్రయోజనాలివే..

వ్యవసాయ మీటర్ల వల్ల ప్రయోజనాలివే..

మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. దీనివల్ల రైతుల మోటార్లు కాలిపోవని, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా కాలిపోవన్నారు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం తెలిపారు. వాడిన విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారన్నారు. అక్కడనుంచి ఆడబ్బు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుందన్నారు. దీనివల్ల రైతులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయని జగన్ తెలిపారు. అలాగే మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు. ఈ వివరాలన్నింటిపైనా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని సీఎం తెలిపారు. దీనివల్ల చాలా విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు. ఈ వివరాలను కూడా విడుదల చేయాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+