లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు: జగన్ గర్వించేలా చేసిన కూతురు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూతురు వర్ష రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సాధించిందని, జగన్ గర్వించేలా చేసిందని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

varsha

జగన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు వర్ష, హర్ష. వీరు చాల లోప్రొఫైల్‌గా ఉంటారు. దగ్గరి వారు తప్పించి వారిని బయటి వారు పెద్దగా గుర్తు పట్టరు. హంగు, ఆర్భాటాలు కనిపించవు. అయితే ఇప్పుడు జగన్ దంపతులు గర్వించే ఘనత సాధించారు. ఈ మేరకు రోజా కూడా పోస్ట్ పెట్టారు.

YS Jagan's daughter to join London School of Economics?

'శభాష్‌ వర్ష... జగన్‌ గర్వించేలా చేసిన కుమార్తె

వైఎస్ జగన్‌కు ఇద్దరు కుమార్తెలున్నారు. వారి పేర్లు వర్ష, హర్ష. అయితే వీరు చాలా లో ఫ్రొపైల్‌లోనే ఉంటారు. దగ్గరి వారు తప్పించి వర్ష, హర్షను బయటివారు కూడా పెద్దగా గుర్తుపట్టలేరు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా, తమ పిల్లలు గొప్పొళ్లు అంటూ ప్రచారం చేసుకోకుండా వారిని పెంచుతున్నారు జగన్‌ దంపతులు.
అయితే ఇప్పుడు జగన్ దంపతులు గర్వించే ఘనత సాధించారు. పెద్ద కుమార్తె వర్ష ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సాధించింది. లండన్‌ లోని ఈ విద్యాసంస్థల్లో సీటు సాధించడం ఆషామాషీ కాదు. ప్లస్‌ టూలో 99% శాతం మార్కులు వచ్చి ఉండాలి.
సీటు కోసం ఎంట్రాన్స్ ఎగ్జామ్‌ కూడా పాస్‌ కావాల్సి ఉంటుంది. ఈ రెండింటిని జగన్ కుమార్తె వర్ష విజయవంతంగా జయించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సొంతం చేసుకుంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో వర్ష సీటు సాధించడంతో జగన్‌ కుటుంబసభ్యుల ఆనందానికి అవదుల్లేవు. జగన్ ఆర్థిక సామ్రాజ్యాన్ని వర్షయే భవిష్యత్తులో లీడ్ చేస్తుందని ఆశిస్తున్నారు. జగన్ చిన్న కుమార్తె హర్ష కూడా చాలా బ్రిలియంట్ అని చెబుతున్నారు. జగన్ చిన్న కుమార్తె మంచి మాట కారి అని తెలిసిన వారు చెబుతుంటార' అని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Varsha Reddy is all set to join the prestigious London School of Economics, a major feat for any Indian girl. She is YS Varsha Reddy and is the daughter of YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...