ఇడుపులపాయలో వైఎస్‌కు జగన్ ఫ్యామిలీ నివాళి (పిక్చర్స్): ఉల్లి పంపిణీ

కడప: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆయన కుమారుడు వైయస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా వైఎస్ ఘాట్ వద్ద వైయస్ జగన్‌తో పాటు వైయస్ విజయమ్మ, షర్మిల తదితరులు నివాళులు అర్పించారు.

వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలు చోట్ల ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

అయితే, విజయవాడలో మాత్రం ఆయన అభిమానులు వినూత్నరీతిలో వైఎస్‌కు నివాళులు అర్పించారు. ప్రస్తుతం అత్యంత ప్రియమైన ఉల్లిపాయలను పంపిణీ చేశారు. విజయవాడ సీతారాంపురం కొత్త వంతెన వద్ద ఉల్లిపాయలు పంపిణీ చేశారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మానం వెంగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇడుపుల పాయలో నివాళులు

ఇడుపుల పాయలో నివాళులు

వర్ధంతి సందర్భంగా వైయస్ రాజశేఖర రెడ్డికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

సమాధి వద్ద...

సమాధి వద్ద...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

జగన్‌తో పాటు..

జగన్‌తో పాటు..

వైయస్ జగన్‌తో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

కుటుంబ సభ్యులు..

కుటుంబ సభ్యులు..

శాసనసభ జరుగుతున్నప్పటికీ వైయస్ జగన్ ఇడుపులపాయకు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+