మూడు రాజధానులపై జగన్ పాలన ప్రభావం-దక్షిణకోస్తాలో మద్దతు కరవు ? ఉత్తరాంధ్రపైనే ఆశలు !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకురావడంలో విఫలమైంది. ఇందుకు గల కారణాలు చాలానే ఉన్నాయి. అయితే మూడేళ్లైనా మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకురాలేకపోవడం మాత్రం ఎన్నికల నాటికి ప్రభావం చూపబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణకోస్తా జిల్లాల్లో తాజా పరిణామాలు ఈ ప్రభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఆశలు ఉత్తరాంధ్రవైపు మళ్లుతున్నాయి.

జగన్ మూడేళ్ల పాలన-మూడు రాజధానులు

జగన్ మూడేళ్ల పాలన-మూడు రాజధానులు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. దాన్ని సమర్ధించుకునేందుకు బోస్టన్ గ్రూప్, జీఎస్ రావు కమిటీ నివేదికలు ఇప్పించింది. అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖ, కర్నూలుకు పంచేందుకు ప్రయత్నించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. అదే సమయంలో ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేసిన తీరు, పాలనా సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలు పలుమార్లు కోర్టుల్లోనూ ఎదురుదెబ్బలకు కారణమయ్యాయి. ఇప్పుడు ఈ మూడేళ్ల పాలన ప్రభావం మూడు రాజధానులపై పడేలా కనిపిస్తోంది.

 దక్షిణ కోస్తాలో రాజధానులకు మద్దతు కరవు ?

దక్షిణ కోస్తాలో రాజధానులకు మద్దతు కరవు ?


దక్షిణ కోస్తా జిల్లాలైన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అమరావతిపై ఎంత సానుకూలత ఉందో తెలియదు కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులకు మాత్రం మద్దతు కనిపించడం లేదు. తాజాగా చోటు చోసుకుంటున్న రెండు పరిణామాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఓవైపు అమరావతి రైతుల పాదయాత్రకు లభిస్తున్న మద్దతు, మరోవైపు ప్రభుత్వం సమాజంలో ప్రభావిత వర్గాల్ని రాజధానులపై ఒప్పించేందుకు నిర్వహిస్తున్న వికేంద్రీకరణ సదస్సుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూస్తుంటే దక్షిణ కోస్తాలో ఫీడ్ బ్యాక్ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నాయి.

అమరావతి పాదయాత్ర-వికేంద్రీకరణ సదస్సులు

అమరావతి పాదయాత్ర-వికేంద్రీకరణ సదస్సులు

అమరావతి రైతులు రాజధానిని అక్కడే ఉంచాలని కోరుతూ అరసవిల్లికి పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు దీన్ని అడ్డుకోవాలంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం దాన్ని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా తాడేపల్లి గూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఏకంగా రోడ్లపై ఫ్లెక్సీలు వేయించి మరీ అమరావతి పాదయాత్రను టార్గెట్ చేసినా యాత్ర ఎలాంటి అడ్డంకుల్లేకుండా సాగిపోయింది. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతు కోసం కాకినాడలో ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో వక్తలు మూడేళ్ల పాలన తర్వాత మూడు రాజధానులకు మద్దతిచ్చేందుకు తాము ఇష్టపడటం లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ప్రభుత్వానికి ఈ రెండు ఫీడ్ బ్యాక్ లు కూడా అందాయి.

ఉత్తరాంధ్రపైనే వైసీపీ ఆశలు ?

ఉత్తరాంధ్రపైనే వైసీపీ ఆశలు ?

దక్షిణ కోస్తా జిల్లాల్లో మూడు రాజధానులకు అంతగా మద్దతు లభించకపోవడం, మరోవైపు అమరావతి పాదయాత్ర కూడా సజావుగా సాగిపోతున్న నేపథ్యంలో వైసీపీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. అయితే ఉత్తరాంధ్ర మాత్రం కాస్త సానుకూల సంకేతాలు పంపుతోంది. విశాఖలో నిర్వహించిన వికేంద్రీకరణ సదస్సుల్లో మూడు రాజధానులకు మద్దతు లభించింది. అంతే కాదు అమరావతి పాదయాత్రపై ఇక్కడ వైసీపీ మంత్రులు ఇస్తున్న పిలుపుకు కొంతమేర సానుకూలత కనిపిస్తోంది. దీంతో రాష్ట్రానికి అసలు రాజధాని కాబోతున్న విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ మూడు రాజధానులకు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ కూడా ఉత్తరాంధ్రపై ఆశలు పెంచుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+