Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదీ ఏపీ ఆర్ధిక పరిస్ధితి- వాస్తవాలు చెప్పిన జగన్ కార్యదర్శి- రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్ర-అప్పులిందుకే

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దిగజారిందని, అప్పులతో రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందంటూ నిత్యం ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం, విపక్షాల విమర్శల నేపథ్యంలో జగన్ సర్కార్ స్పందించింది. దీనిపై వాస్తవ గణాంకాలతో ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్ధితిపై ఓ పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంపై ఆయన మండిపడ్డారు.

 ఏపీ ఆర్దిక పరిస్ధితిపై దుష్ప్రచారం

ఏపీ ఆర్దిక పరిస్ధితిపై దుష్ప్రచారం

కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ పత్రికలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షం మొదలుపెట్టిన ఈప్రచారాన్ని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వాస్తవాలను వక్రీకరించి, ప్రజల్లో అపోహలను సృష్టించడానికి ఈ ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది చాలా బాధకరమైన పరిస్థితి అని ఆయన అన్నారు.

వీరు ఒకవైపు వాదనను వినిపించడమో లేదా ఆర్థిక అంశాలమీద పూర్తి అవగాహన లేక ఇచ్చే ప్రకటనల వల్లకూడా కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.

 పథకాలు ఆపేయాలనే కుట్ర

పథకాలు ఆపేయాలనే కుట్ర

రాష్ట్ర ఆర్ధిక పరిస్దితిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసని ముఖ్యమంత్రి కార్యదర్శఇ తెలిపాపరు. ఆర్థిక పరంగా రాష్ట్రం చాలా దయనీయ పరిస్థితిలో ఉందని, రాష్ట్రం దివాళా మార్గంలో పయనిస్తోందని ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సమాచారాన్ని నమ్మించి రాష్ట్రానికి పరపతి లేకుండా చేయాలని, అప్పులు పుట్టనివ్వకుండా చేసి తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగనీయకుండా అడ్డు వేయాలన్నది దీనివెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం తన ప్రతిష్టను కోల్పోతుందనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు, దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారన్నారు. అందుకే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ వివరాలు బయటపెడుతున్నట్లు వివరించారు.

 రెవిన్యూ లోటుపై వక్రీకరణలా?

రెవిన్యూ లోటుపై వక్రీకరణలా?

తాజాగా ఒక పత్రికలో రాష్ట్రం రెవిన్యూ లోటు, బడ్జెట్‌ అంచనాలకు మించి, మొదటి మూడు త్రైమాసికాల్లోనే, డిసెంబరు నాటికే 918%కి చేరుకుందని అని ఈ కథనంలో రాశారని, దీనిద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారని దువ్వూరి కృష్ణ ఆరోపించారు. నిజం చెప్పాలంటే.. ఇదొక బడ్జెటింగ్‌ ఎక్సర్‌సైజ్‌ అని, బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు సంబంధించి ఆదాయాలు, ఖర్చులు... తదితర అంశాలరు సంబంధించి ఈ ప్రమాణాలను పేర్కొంటూ ఉంటారని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు. గడచిన మూడేళ్లుగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండడం, కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కచ్చితంగా ఇంతే రెవిన్యూ లోటు ఉంటుందని కచ్చితంగా అంచనా వేయడంకూడా చాలా క్లిష్టమైన పరిస్థితి అన్నారు. ఎలాంటి విపత్తు, ఎలాంటి కష్టం లేనప్పుడు కూడా టీడీపీ హయాంలో రెవిన్యూ లోటు 918 శాతం ఉందని ఏ రికార్డు చూసి చెప్పారో, అదే రికార్డులో 2016-19 మధ్య మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రెవిన్యూ లోటుకు సంబంధించిన గణాంకాలను ఒకసారి పరిశీలించాలన్నారు.

 కోవిడ్ లేనప్పుడు టీడీపీ ఏం చేసిందంటే ?

కోవిడ్ లేనప్పుడు టీడీపీ ఏం చేసిందంటే ?

కేంద్రం పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటాను గమనిస్తే 2018-19లో రూ.32,781 కోట్లుగా ఉందని దువ్వూరి తెలిపారు.. సాధారణంగా కోవిడ్‌లాంటి విపత్తు లేని సందర్భాల్లో ఏటా 10 -15 శాతం పెరుగుతుంది. కానీ 2019-20లో అది రూ. 28,012 కోట్లకు పడిపోయింది. 2020-21 నాటికి రూ.24,460 కోట్లకు పడిపోయింది. 2022-23 నాటికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా అంచనా రూ.33,050 కోట్లు చూపిస్తున్నారు. అంటే 2018-19లో వచ్చిన పన్నుల వాటానే 2022-23లో కూడా చూపిస్తున్నారు. దాదాపుగా నాలుగు సంవత్సరాలపాటు వృద్ధిని కోల్పోయామని ఇక్కడ స్పష్టమవుతోందన్నారు. సాధారణ పరిస్థితుల్లో 8% వృద్ధి ఉందని అంచనా వేసుకున్నా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 2022-23కి సంబంధించి కనీసంగా రూ.44,600 కోట్లు వచ్చేదన్నారు. దీన్ని బట్టి ఎంతకష్టకాలమో, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. టికితోడు రాష్ట్ర విభజన పర్యవసానంగా తలెత్తిన సమస్యలు, ఆతర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో జరిగిన లోప భూయిష్టమైన పరిపాలన, వారసత్వంగా వచ్చి రుణాలు, చెల్లింపులు మరొక కారణమన్నారు.

 బాబు హయాంలో 17, ఇప్పుడు 14

బాబు హయాంలో 17, ఇప్పుడు 14

రాష్ట్రం విభజించే నాటికి రాష్ట్రానికి అప్పులు రూ. 97,213 కోట్లు కాగా... పబ్లిక్‌ అక్కౌంట్‌తో కలుపుకుని రూ.1,20,556 కోట్లు. టీడీపీ పాలన ఐదేళ్లలో రూ,2,68,225 కోట్లకు అప్పులు చేరాయని దువ్వూరి కృష్ణ వెల్లడించారు. ఆ ఐదేళ్లలో సగటున ప్రతి ఏడాదికి 17శాతం మేర అప్పులు పెరుగుకుంటూ వచ్చాయన్నారు. అంతేకాదు చెల్లించకుండా వదిలిపెట్టిన బకాయిలు రూ.39వేల కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో తెచ్చిన అప్పులు దాదాపుగా రూ.14,028 కోట్లు ఉన్నాయన్నారు.. అదికాస్తా గత ప్రభుత్వం హయాంలో రూ.58వేల కోట్లకు వెళ్లిందన్నారు. 2019 ఎన్నికలకు ఒక రోజు ముందు.. ఏప్రిల్‌ 9న ఒకరోజులోనే ఆర్బీఐలోనే రూ.5వేల కోట్లు అప్పులు చేసిందన్నారు. ఒకరోజులో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసిన రాష్ట్రం ఇటీవలి కాలంలో ఎక్కడా లేదన్నారు.

 ఆస్తుల అమ్మకం బెటరా ? తాకట్టు బెటరా

ఆస్తుల అమ్మకం బెటరా ? తాకట్టు బెటరా

ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపైనా జరుగుతున్న ప్రచారాలపై దువ్వూరి స్పందించారు. ఏదైనా రుణం తీసుకునేటప్పుడు దానికి సెక్యూరిటీ చూపించడం అన్నది నిబంధన. అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందేనన్నారు. గత ప్రభుత్వం భూములు తాకట్టుపెట్టి సీఆర్డీకు రుణాలు సమకూర్చుకుంది. తెస్తున్న రుణాలన్నీకూడా ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు. చెల్లింపులు అన్నవి ఎప్పటికీ విఫలం కావు. ఈ తాకట్టులపై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు.. చాలారాష్ట్రాలైతే ఆయా చోట్ల భూములను అమ్మేసి మానిటైజ్‌ చేసుకుంటున్నాయని, తెలంగాణ ప్రభుత్వం కోకోపేట లాంటి చోట్ల భూములు అమ్మి దాదాపు రూ.2700 కోట్లు సమీకరించింది. కేంద్ర ప్రభుత్వమైతే పెట్టుబడుల ఉపంసహరణకోసం ఏకంగా ఒక డిపార్ట్‌మెంట్‌నే పెట్టారన్నారు. ప్రతిష్టాత్మకమైన ఎల్‌ఐసీ లాంటి సంస్థలో కూడా పెట్టుబడుల ఉపసంహరణ చేయాలనే ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారు. రకరకాల ఆస్తులను ప్రైవైటేజేషన్‌ చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే.. ఆస్తులను అమ్మడమే.అలాంటిది మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆస్తుల అమ్మకాలు జరగలేదన్నారు. కేవలం తాకట్టు మాత్రమే పెట్టారన్నారు. ఆ రుణాలకు ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఉంది. ఇవన్నీకూడా ప్రజలు గమనించాలన్నారు.

 జగన్ సర్కార్ అప్పులు ఇందుకే !

జగన్ సర్కార్ అప్పులు ఇందుకే !

చివరిగా వైసీపీ సర్కార్ అప్పులెందుకు చేస్తుందన్న అంశంపైనా క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీకూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఖర్చు చేస్తున్నామని, కష్టకాలంలో ప్రజలకు మంచి విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇవన్నీ అందడానికి ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఇది గర్వించదగ్గ విషయమని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వివరణ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏచేసినా సరే అది తప్పుగా చూపించడం పరిపాటిగామారిందన్నారు నిష్పక్షపాతంగా ఈ విషయాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన మీడియాను కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+