జగన్ ఘాటు వ్యాఖ్య: 'ఆ 8 మందిలో ఒక్కరైనా టీడీపీ తరుపున గెలిస్తే గుండు గీయించుకుంటా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ సోమవారం రాత్రి ఘాటు వ్యాఖ్య చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను మంగళవారానికి వాయిదా వేశారు.
అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన వైయస్ జగన్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ శాసనసభను కౌరవసభగా అభివర్ణించిన ఆయన, కౌరవ సభలో తమకు న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. అందుకే మంగళవారం స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు స్పీకర్ తీరును తప్పుబట్టారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ విపక్షం మగతనం గురించి మాట్లాడటం కాదని, వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని అన్నారు.

ఇటీవలే టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. ఆ 8 మందిలో ఒక్కరైనా టీడీపీ తరుపున గెలిస్తే గుండు గీయించుకుంటామని సవాల్ విసిరారు. జగన్‌కు మగతనం ఉన్నందువల్లే గతంలో ఆయన పార్టీలోకి వచ్చిన 16 మందితో రాజీనామా చేయించి గెలిపించుకున్నారని తెలిపారు.
నోటీసు ఇవ్వగానే చర్చా?: వైసీపీ ఆశ్చర్యం
ఏపీ అసెంబ్లీ చరిత్రలో నోటీసు ఆమోదించిన వెంటనే చర్చ జరగలేదని విపక్ష సీనియర్ సభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభకు నోటిసిచ్చిన పదిరోజుల్లోపు ఎప్పుడైనా చర్చ చేపట్టవచ్చన్నారు. ఈ సభలో కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications