జగన్ షాకింగ్-నిధులు ఆపేసి, అధికారుల్ని మార్చేసి.. ఎన్నికలపై నమ్మకం సన్నగిల్లుతోంది..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీంతో రాజకీయ పార్టీలు తుది దశ ప్రచారంలో హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మచిలీపట్నంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాాగ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి చర్చనీయాంశమవుతున్నాయి.
మచిలీపట్నంలో ఇవాళ జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన జగన్.. రాష్ట్రంలో ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లుతోందన్నారు. ఇష్టానుసారంగా అధికారుల్ని మార్చేస్తున్నారన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతున్నారంటూ ఆక్షేపించారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు డబ్బులు లబ్దిదారులకు అందకుండా ఆపేస్తున్నారంటూ టీడీపీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ నిర్ణయాలపై జగన్ పరోక్షంగా విమర్శలు చేశారు.

ఇక కూటమి గెలుపు లాంఛనమే. సీన్ అర్థమయిపోయి ఆఖరి రాగం పాడేసిన జగన్!
— JanaSena Party (@JanaSenaParty) May 6, 2024
"ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం"#HelloAP_ByeByeYCP👋#VoteForGlass | #VoteForNDA☝️#AllianceForABetterFuture✊ pic.twitter.com/Sqn8aW6Kwd
మరోవైపు జగన్ వ్యాఖ్యలతో ఆయనలో భయం కనిపిస్తోందని విపక్షాలు విమర్శలు మొదలుపెట్టేశాయి. జనసేన పార్టీ ఎక్స్ లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఇక కూటమి గెలుపు లాంఛనమే. సీన్ అర్థమయిపోయి ఆఖరి రాగం పాడేసిన జగన్!"ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం" అంటూ వ్యాఖ్యలు జత చేసింది. ఇదే బాటలో మిగతా విపక్ష పార్టీలు, వారి సానుభూతిపరులు కూడా పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications