ముంబై వెళ్లేందుకు జగన్‌కు కోర్టు ఓకే, చెన్నైపై వాయిదా

జగన్ శనివారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, సాయంత్రం జెడి(యు) అధినేత శరద్ యాదవ్‌ను కలువనున్నారు. కాగా, వైయస్ జగన్ ఇటీవల కోర్టు అనుమతితో పశ్చిమ బెంగాల్ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కోల్‌కతాకు వెళ్లిన జగన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు.
మరోవైపు, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం తాను ఉత్తరప్రదేశ్ వెళ్లలేకపోయాయనని, ఆ పర్యటనను రద్దు చేసుకున్నానని కేవలం కోల్‌కతా మాత్రమే వెళ్లి వచ్చానని వైయస్ జగన్ సిబిఐ కోర్టుకు గురువారం తెలిపారు. ఈ మేరకు ఆయన న్యాయవాది గురువారం మెమో దాఖలు చేశారు.
తొలుత కోల్‌కతా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లాలని భావించానని అందుకు కోర్టు అనుమతించిందన్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల యూపి వెళ్లలేదని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ వెళ్లి సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లను కలుసుకోవాలని జగన్ భావించారు.












Click it and Unblock the Notifications