దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ షాక్.. సీరియస్ నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ ఆయనకి ఇద్దరు బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఆయన ఇంటి ముందు ధర్నా చేయడంతో వ్యవహారం కాస్త రచ్చకెక్కింది.

దువ్వాడ శ్రీనివాస్ వాణి కుటుంబాల మధ్య చర్చలకు బ్రేక్
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపణలు చేసిన దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ భార్య పైన సంచలన వ్యాఖ్యలతో ఎదురుదాడికి దిగడంతో ఈ ఫ్యామిలీ ఫైట్ రసవత్తరంగా మారింది. ఇక దువ్వాడ ఫ్యామిలీ పోరును పరిష్కరించడానికి రెండు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగినా వాణి డిమాండ్లలో ఒక డిమాండ్ ను దువ్వాడ అంగీకరించకపోవడంతో చర్చలకు బ్రేక్ పడి ప్రస్తుతం స్తబ్దత కొనసాగుతుంది.

YS Jagan shock to Duvvada Srinivas said to resign for MLC hot topic

జగన్ సీరియస్ డెసిషన్
ఇక దువ్వాడ వాణి మాత్రం తాను పట్టిన పట్టు విడవకుండా శ్రీనివాస్ ఇంటి ముందే దీక్షను నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ నాయకుల వ్యక్తిగత వివాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర తలనొప్పిగా తయారు కాగా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం.

దువ్వాడ అడల్ట్రీ వ్యాఖ్యలతో జగన్ కు ఇబ్బంది
ఇప్పటికే ఏపీలో అధికారం పోగొట్టుకున్న తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం రచ్చ రచ్చ కాగా తాజాగా దువ్వాడ కుటుంబ పోరు రాష్ట్రంలో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ తాను మాధురి తో సంబంధం పెట్టుకున్నట్టు, అడల్ట్రీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు జగన్ ను ఇబ్బంది పెడుతున్నాయి అని సమాచారం.

దువ్వాడను రాజీనామా చెయ్యమన్న జగన్
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకొని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నాడన్న కారణంతో దువ్వాడ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. జగన్ ఆదేశాలతో త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాజీనామా చెయ్యకుంటే పార్టీ నుండి సస్పెన్షన్
దువ్వాడ వ్యవహారంతో పార్టీకి నష్టం జరగకుండా నష్ట నివారణ చర్యల్లో భాగంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
జగన్ ఆదేశాలతో రెండు మూడు రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ శ్రీనివాస్ రాజీనామా చేయకుండా అలాగే కొనసాగిస్తే, శ్రీనివాస్ వివాదం మరింత ముదిరితే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

జగన్ కీలక ఆదేశం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నేతలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ నుంచే దిద్దుబాటు మొదలు పెట్టాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో రోత పుట్టిస్తున్న దువ్వాడ వ్యవహారం లో జగన్ దువ్వాడకు కీలక ఆదేశం ఇచ్చి షాక్ ఇచ్చినట్టుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+