అబద్దాలు చెప్పటంలో దిట్ట.. గోబెల్స్ కు తమ్ముడు చంద్రబాబు: వైఎస్ జగన్
అబద్దాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్‌కు తమ్ముడు అవుతాడు. అబద్దాలను మాన్యుఫ్యాక్చర్ చెయ్యటంలో చంద్రబాబు దిట్టని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటించారు. ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాలను సందర్శించి, బాధితులతో మాట్లాడారు. మాధవపురం, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేటలో పర్యటించిన జగన్, వరద బాధితులను పరామర్శించి, వారికి కలిగిన నష్టాన్ని ఆరా తీశారు.
చంద్రబాబుకు మానవత్వం ఉంటే ఆ పని చేసేవారు
రమణక్కపేటలో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితి చూస్తే, విజయవాడ గుర్తుకొస్తోందని, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేయలేదన్నారు. తుపాన్‌పై ముందే సమాచారం ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం రివ్యూ నిర్వహించలేదని, కలెక్టర్లతో మాట్లాడలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసిఉంటే, స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి, ముందు జాగ్రత్తలు చేపట్టే వారని, కానీ అవేమీ చేయలేదని, అన్నీ గాలికొదిలేశారన్నారు.

ఏలేరు రిజర్వాయర్ పై నిర్లక్ష్యం.. ముంపుకు బాబే కారణం
ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండే దాకా పట్టించుకోకుండా ఒక్కసారే సామర్ధ్యాన్ని మించి నీళ్ళు దిగువకు వదిలారని, అందుకే ముంపు వచ్చిందని ఇవన్నీ వాస్తవాలన్నారు. ఇది మానవత్వం లేని ప్రభుత్వం. ప్రజల గురించి అస్సలు పట్టింపులేదని ఆరోపించారు.ఎక్కడ, ఏం జరిగినా.. దానికి కారణం జగన్ అంటున్నాడు.దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా, ప్రతి దానికి మమ్మల్నే నిందిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఇక జగన్నామ స్మరణ ఆపాలని చురకలంటించారు.
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అడుగడుగునా మోసం
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారని, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థనలనూ నాశనం చేశారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. పంటల బీమా ప్రీమియమ్ కూడా కట్టడం లేదని ఆరోపించారు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు లేవని, రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు
రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవని, రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేవన్నారు.గతంలో రైతులకు ఎంత వచ్చేది? ఒక్కసారి ఆలోచించండని పేర్కొన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు, చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా తన మార్క్ మోసం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications