జగన్ పాలన దశాబ్ధాలపాటు, ఆ మూడు పార్టీలు ఉన్నా లేనట్లే: సజ్జల, వెల్లంపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిరంతరాయంగా దశాబ్దాలపాటు కొనసాగాలన్నారు. అంతేగాక, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రంలో తలమానికంగా మారాలన్నారు.

రెండేళ్లలోనే హామీలన్నీ నెరవేర్చారు జగన్: సజ్జల

రెండేళ్లలోనే హామీలన్నీ నెరవేర్చారు జగన్: సజ్జల

పాదయాత్ర లో ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే సీఎం జగన్ అమలు చేశారని కొనియాడారు సజ్జల. శనివారం కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నాని, వరాలు ఇచ్చే దేవుడు వాడపల్లి వెంకటేశ్వరస్వామి అని సజ్జల తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు బయటపడేందుకు దేవుడి ఆశీస్సులు ఉండాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

చంద్రబాబు ఆలోచన అవే: వెల్లంపల్లి శ్రీనివాస్

చంద్రబాబు ఆలోచన అవే: వెల్లంపల్లి శ్రీనివాస్

మరోవైపు, వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జురుపుకుంటున్నాయి. విజయవాడలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ పేదల గురించి ఏనాడూ ఆలోచించలేదు. క్యాపిటల్, పెట్టుబడిదారులు, తమ సామాజికవర్గం వారి గురించి మాత్రమే చంద్రబాబు ఆలోచన చేశాడని ఆరోపించారు. .

దేశంలో ఏ సీఎం చేయలేని పనులు జగన్ చేశారు: వెల్లంపల్లి

దేశంలో ఏ సీఎం చేయలేని పనులు జగన్ చేశారు: వెల్లంపల్లి

పేదల గురించి ఆలోచించింది ఆనాడు వైఎస్సార్.. నేడు జగన్ మాత్రమేనని వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎండ, వాన లెక్క చేయకుండా 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అనేక ఘటనలు వైఎస్‌ జగన్‌కు ఎదురయ్యాయి. మేనిఫెస్టోని రెండేళ్లలోనే నెరవేర్చారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి వైఎస్‌ జగన్. ప్రజల నాడి, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్. ప్రజలకి మంచి చేయాలన్న మనసున్న వ్యక్తి. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఆ మూడు పార్టీలో దాడి చేయడానికి మాత్రమే: వెల్లంపల్లి శ్రీనివాస్

ఆ మూడు పార్టీలో దాడి చేయడానికి మాత్రమే: వెల్లంపల్లి శ్రీనివాస్

రాజకీయ పార్టీలకు అతీతంగా భారతదేశంలో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని సగర్వంగా చెబుతున్నాం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే జగన్‌పై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయని మండిపడ్డారు వెల్లంపల్లి. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకూ ప్రజలు మాకు అండగా నిలిచారు. రేపు జరగబోయే ఎన్నికల్లోనూ మాదే విజయం. ఏపీలో ప్రతిపక్షపార్టీల అవసరం లేదు. జనసేన, బీజేపీ, టీడీపీలు చూడ్డానికి మాత్రమే విడివిడిగా ఉండే రాజకీయ పార్టీలు. సీఎం జగన్‌పై దాడి చేయడానికి మాత్రం మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలు మాతో ఉన్నారు. రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+