పవన్ ఎందుకు వెళ్లలేదు - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వం పై పోరుబాట ప్రకటించారు. ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక ఉందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై బాదుడు ప్రారంభించిందని పేర్కొన్నారు. నెలకో అంశం తీసుకొచ్చి నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతీ కార్యకర్త సోషల్ మీడియా ఎకౌంట్ కలిగి ఉండాలని జగన్ కేడర్ కు పిలుపునిచ్చారు.

పవన్ ఎందుకు వెళ్లలేదు
ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలన పైన ఆరు నెలల కాలంలోనే ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోందని విశ్లేషించారు. ప్రతీ నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు హామీలు అమలు చేయలే క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. బియ్యం రవాణా అంశంలో కూటమి నేతల ప్రచారం పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బి య్యాన్ని ఎగుమతి చేస్తున్నా... కానీ, ఆ షిప్‌ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని చెప్పారు.

YS Jagan Slams Chandra Babu s decision over power charges hike key directions for party cadre

నాడు అలా - నేడు ఇలా
బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని జగన్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. పయ్యావుల వియ్యంకు డు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్‌ గా జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు వస్తూనే విద్యుత్ ఛార్జీలు పెంచారని జగన్ ఆరోపించారు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్స్‌లు వేసే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సంపద సృష్టి అంటే.. బాదుడే బాదుడని ఎద్దేవా చేసారు. తమ హయాంలో మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టించామని.. వీటిని పద్దతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడని మండిపడ్డారు.

ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతాలు
వెలిగొండ రెండు టన్నెల్స్‌ పూర్తి చేశామని జగన్ గుర్తు చేసారు. ఆర్‌ అండ్‌ అర్‌ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈనెల 13న రైతు సమస్యలపైన, కరెంటు ఛార్జీలపైన ఈనెల 27న, అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం జనవరి 3న పోరుబాట లో భాగంగా నిరసన కార్యక్రమం చేస్తున్నామని జగన్ వివరించారు. దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారని.. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్‌ మీడియా ఖాతా ఉండాలని సూచించారు. అన్యాయం జరిగితే దాని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాలని జ‌గ‌న్ పార్టీ నాయ‌కుల‌కు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+