ఒక్కసారి వస్తే 30ఏళ్లు మనమే: జగన్(పిక్చర్స్)
ప్రకాశం: ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అబద్దాలు చెప్పను నిజాయితీగా వ్యవహరిస్తానంటూ ఆయన నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
సోమవారం ఒంగోలులోని బచ్చల బాలయ్య, సంజీవమ్మ ఫంక్షన్ హాలులో కందుకూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన యకులు, కార్యకర్తలతో జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో బాబువస్తే జాబువస్తుందని ప్రచారం చేశారని కాని, అధికారంలోకి వచ్చిన తరువాత జాబులు పోతున్నాయని ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

వైయస్ జగన్
అబద్దాలు చెప్పను నిజాయితీగా వ్యవహరిస్తానంటూ ఆయన నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

వైయస్ జగన్
సోమవారం ఒంగోలులోని బచ్చల బాలయ్య, సంజీవమ్మ ఫంక్షన్ హాలులో కందుకూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన యకులు, కార్యకర్తలతో జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

వైయస్ జగన్
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో బాబువస్తే జాబువస్తుందని ప్రచారం చేశారని కాని, అధికారంలోకి వచ్చిన తరువాత జాబులు పోతున్నాయని ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మంచి పనులు చేసి ప్రజల గుండెల్లో నిలిచారని.. అందువల్లే ప్రజలు ఆయన్ని దేవునిలా ఆరాధిస్తున్నారని చెప్పారు.

వైయస్ జగన్
రాష్టవ్య్రాప్తంగా 43లక్షల 13వేల పెన్షన్లు ఉంటే వాటిలో తెలుగుదేశం ప్రభుత్వం కోతపెట్టిందని ధ్వజమెత్తారు. పార్టీకి ఓటువేసిన ప్రజలందరికి అండగా ఉంటానని భరోసాఇచ్చారు.

వైయస్ జగన్
చంద్రబాబు అన్యాయాలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బాబు అబద్దాలను కొన్ని మీడియా సంస్ధలు మోస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గ్రామస్ధాయినుండి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు.
చంద్రబాబు అన్యాయాలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బాబు అబద్దాలను కొన్ని మీడియా సంస్ధలు మోస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గ్రామస్ధాయినుండి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలను చేయాలని ,అర్హులైన వారందరికి పెన్షన్లను మంజూరు చేయాలని కోరుతూ డిసెంబర్ 5న జిల్లాకలెక్టరేట్‌ల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు జగన్ వెల్లడించారు.
ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, రాష్టప్రార్టీ కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, కందుకూరు, అద్దంకి, సంతనూతలపాడు శాసనసభ్యులు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలం సురేష్, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications