అసలు మనిషేనా? రాసలీలల ఎమ్మెల్యేపై జగన్ ఫైర్..!

ఏపీలో రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. శ్రీధర్ తనను లైంగికంగా వాడుకున్నాడని, ఏడాదిన్నరలో ఐదుసార్లు అబార్షన్లు కూడా చేయించాడని ఆరోపిస్తూ ఓ మహిళా ఉద్యోగి నిన్న విడుదల చేసిన వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో అవన్నీ డీప్ ఫేక్ వీడియోలంటూ శ్రీధర్ కుటుంబం వివరణ ఇచ్చినా రచ్చ మాత్రం ఆగలేదు. దీంతో ఆయన సొంత పార్టీ జనసేన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.

అరవ శ్రీధర్ పై జగన్ ఫైర్

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (ys jagan) ఇవాళ అరవ శ్రీధర్ ఘటనపై స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భీమవరానికి చెందిన పార్టీ నేతలతో భేటీ అయిన జగన్.. అరవ శ్రీధర్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు మనిషేనా? అని జగన్ ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే, ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా బయపడితే, ఏ చర్యా లేదన్నారు.

ys jagan slams janasena mla arava Sridhar over sexual harassment videos

కూటమిలో ఈ ఎమ్మెల్యేలంతా..!

అలాగే గతంలో కూటమిలోని మరికొందరు ఎమ్మెల్యేల వేధింపుల్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆముదాలవలస అమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు భరించ లేక ఒక స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆత్మహత్యా యత్నం చేసిందని, అయినా ఏ చర్య లేదన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసినా, చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్‌ చేయించుకోవడం ఎంత దారుణం అని ప్రశ్నించారు.

ys jagan slams janasena mla arava Sridhar over sexual harassment videos

వీళ్లను జైల్లో పెట్టకుండా

మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ, తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే.. అతణ్ని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారని జగన్ గుర్తుచేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ ఫోన్‌లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడని, ఇంకా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్సులు వేశాడని జగన్ ఆరోపించారు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడన్నారు. అలా రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడి తనం కనిపిస్తోందన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే, జైల్లో పెట్టాల్సింది పోయి, వారిని చంద్రబాబు, లోకేష్, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+